|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఉండగా.. చిరంజీవి సంచలన నిజం! మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Published: 22-07-2026, 2:35 PM

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ కనిపించినా అది పండగే! తాజాగా “చెన్నై లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దిగ్గజ నటుల గురించి చిరు చెప్పిన నిజం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వైరల్ న్యూస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

Key Points

1

చిరంజీవి "చెన్నై లవ్ స్టోరీ" ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిథిగా హాజరు.

2

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ హయాంలో ఇండస్ట్రీ ప్రవేశంపై చిరు షాకింగ్ కామెంట్స్.

3

కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్‌లను ప్రశంసించిన మెగాస్టార్.

4

మణిశర్మతో తన అనుబంధంపై చిరంజీవి ఎమోషనల్ వ్యాఖ్యలు.

మెగాస్టార్ చిరు చెన్నై లవ్ స్టోరీ ఎమోషనల్ ప్రసంగం!

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియా జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సాయి రాజేష్, ఎస్ కె ఎన్ నిర్మాతలుగా రవి నంబూరి దర్శకత్వంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

రెండురోజుల్లో రిలీజ్ కాబోతుండడంతో నేడు బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తనదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తూ మెగాస్టార్ తన అభిమానులని హూషారెత్తించారు. చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ వినగానే నాకు చెన్నై జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అంటే నాకు చెన్నైలో లవ్ స్టోరీలు ఉన్నాయి అని తప్పుగా అనుకోవద్దు అంటూ నవ్వించారు.

లెజెండరీ స్టార్స్‌పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

చెన్నైలో నాకు లవ్ స్టోరీలు లేవు, చెన్నైతో లవ్ స్టోరీ ఉంది. చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఉంది. నటుడిని కావాలని కలలు కని చెన్నైకి వెళ్లిన రోజులు గుర్తుకు వస్తున్నాయి అని చిరంజీవి అన్నారు. ఇప్పుడు ఈ స్టేజీపై ఉన్నవాళ్ళల్లో ఎక్కువ మంది నా అభిమానులే. వీళ్లంతా యంగ్ స్టర్స్. వీళ్ళ కోసమే నేను ఇక్కడికి వచ్చాను.

సాయి రాజేష్, ఎస్ కె ఎన్ వీళ్లంతా నా అభిమానులే. కిరణ్ అబ్బవరం నా అభిమాని కాదు.. తను పవన్ కళ్యాణ్ అభిమాని. స్వర్గస్తులైన వాళ్ళ బ్రదర్ నా అసలైన అభిమాని అని చిరంజీవి తెలిపారు. నా అభిమానులు ఉన్నత స్థాయికి ఎదిగితే నాకు చాలా సంతోషంగా, ఎమోషనల్ గా ఉంటుంది. ఇండస్ట్రీకి రావాలి అని కలలు కనే యువత ఎస్ కె ఎన్, సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

కిరణ్ అబ్బవరంపై చిరు ప్రశంసలు, మణిశర్మ గురించి!

సంకల్పం ఉంటె మనకి ఇష్టమైన ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు , మురళి మోహన్, చంద్ర మోహన్ లాంటి స్టార్లు ఉన్న ఇండస్ట్రీలోకి నేను ఏ ధైర్యంతో వచ్చానో నాకే తెలియదు. కానీ వాళ్లందరికంటే కొత్తగా ఏదైనా చేసే ఆడియన్స్ ని మెప్పించాలి అనే తపన మాత్రం ఉండేది అని చిరంజీవి అన్నారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో ఆడియన్స్ అని ఆకట్టుకుంటున్నాడు. ఇంకా మంచి స్థాయికి అతడు ఎదగాలి అని చిరంజీవి అన్నారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నేను ఒళ్ళు హూనం చేసుకునేలా డ్యాన్స్ చేశాను అంటే ఆ క్రెడిట్ మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కి దక్కుతుంది అని చిరంజీవి అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాటలు ఎప్పుడూ అభిమానులను అలరిస్తాయి. ఆయన చెప్పిన ఈ అరుదైన విషయాలు టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.