|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాస్ట్లీ కారు కొన్న వైవా హర్ష, భార్యతో కలిసి ఫోజులిచ్చిన స్టార్ నటుడు

Published: 26-05-2025, 2:22 PM
కాస్ట్లీ కారు కొన్న వైవా హర్ష, భార్యతో కలిసి ఫోజులిచ్చిన స్టార్ నటుడు

వైవా హర్ష, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్న నటుడు. తాజాగా అతను తన కలల కారును కొనుగోలు చేయడంతో పాటు, భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు.

Key Points

1

వైవా హర్ష తన కలల కారు BMW F87 M2 Competition కొనుగోలు చేశాడు.

2

భార్య అక్షరతో కలిసి కొత్త కారుతో ఫోటోలు షేర్ చేశాడు.

4

హర్ష కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ సక్సెస్ సాధిస్తున్నాడు.

వైవా హర్ష కొత్త కారు

వైవా షార్ట్ ఫిల్మ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ హర్ష, టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హర్ష. మన్ననలు పొందుతున్నాడు. సినీ రంగంలోకి అడుగుపెట్టి, మొదట హీరో ఫ్రెండ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన హర్ష, 2023లో వచ్చిన ‘సుందరం మాస్టర్’ సినిమాతో హీరోగా మారాడు. రవితేజ నిర్మించిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, హర్షకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.

ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా ద్వారా ప్రేక్షకులను నవ్వించిన హర్ష, ప్రస్తుతం మోగ్లీ మరియు బకాసుర సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్నాడు.

సోషల్ మీడియాలో వైరల్

ఇక సినిమాల విషయం పక్కన పెడితే, హర్షకు కార్లు, బైక్స్ పట్ల ప్రత్యేక ఆసక్తి ఎక్కువ. ఇప్పటికే అతని గ్యారేజ్‌లో లగ్జరీ స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. తాజాగా, హర్ష తన కలల కారు అయిన BMW F87 M2 Competition కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా హర్ష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. కొత్త కారుతో పాటు భార్య అక్షరతో కలిసి దిగిన ఫొటోల్నీ షేర్ చేశాడు.

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా తారలు, అభిమానులు, నెటిజన్లు హర్షకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ కారు ధర సుమారుగా రూ. 1.30 కోట్లు నుండి రూ. 1.40 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.

కెరీర్‌లో హర్ష సక్సెస్

హర్ష – అక్షర దంపతులపై గతంలో విడాకుల ప్రచారం వచ్చినా, తాజా ఫొటోలతో వాళ్ల నోళ్లు మూవపడ్డాయి. వీరిద్దరూ వివాహం చేసుకున్న అప్పటి నుంచి హర్ష తరచూ భార్యతో కలిసి ఫొటోలు షేర్ చేస్తూ వస్తున్నారు.ఇలా వ్యక్తిగత జీవితంలో స్టెబిలిటీ, కెరీర్ పరంగా ప్రోగ్రెస్ కొనసాగిస్తున్న హర్ష, ఇప్పుడు ఖరీదైన BMW కారుతో మరో మైలురాయిని చేరుకున్నాడు.

వైవా హర్ష సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నాడు. కొత్త కారుతో అతని సక్సెస్‌కు మరో అద్దం పడుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.