|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Actor Jeevan : రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే ఏం జరుగుతుందో తెలుసా..? పచ్చి నిజాలు బయటపెట్టిన జీవన్..

Published: 07-12-2025, 11:48 PM
Actor Jeevan : రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే ఏం జరుగుతుందో తెలుసా..? పచ్చి నిజాలు బయటపెట్టిన జీవన్..
  • నటుడు జీవన్ రెమ్యూనరేషన్ పెంపుపై టాలీవుడ్‌లో ఉన్న దారుణమైన నిజాలను బయటపెట్టారు.
  • రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే ఆ విషయం ఇండస్ట్రీ అంతా పాకి అవకాశాలు తగ్గిపోతాయని జీవన్ వెల్లడించారు.
  • చిన్న నటులకు సరైన గుర్తింపు లేదని, హీరోలకు ఉన్న విలువ తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
  • టాలెంట్ ను నమ్ముకున్న వారికి తరుణ్ భాస్కర్ వంటి వారు మద్దతు ఇస్తున్నారని జీవన్ తెలిపారు.

నటుడు జీవన్ టాలీవుడ్‌లో చిన్న నటులు ఎదుర్కొంటున్న రెమ్యూనరేషన్ సమస్యలపై సంచలన నిజాలను బయటపెట్టారు. రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే అవకాశాలు ఎలా కోల్పోతారో ఆయన వివరించారు. ఇండస్ట్రీలో టాలెంట్ ను తొక్కేస్తున్నారనే వాదనకు బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

రెమ్యూనరేషన్ పెంపుపై నటుడు జీవన్ సంచలన వ్యాఖ్యలు

Actor Jeevan : తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ను తొక్కేస్తున్నారని చాలా మంది నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సింగిల్ టేక్ తో డైలాగు చెప్పినా సరే మాకు పెద్దగా గుర్తింపు రాలేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ మధ్య ఫిలిం యాక్టర్స్ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ గురించి ఎన్నో నమ్మలేని నిజాలను బయటపెడుతున్నారు. దారుణమైన పరిస్థితుల గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.. ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న విలువ చిన్న నటులకు లేదని వాపోతున్నారు. తాజాగా మరో నటుడు జీవన్ రెమ్యూనరేషన్ పెంపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన పరిస్థితి వివరించారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం..

అవకాశాలు కోల్పోయే భయం: టాలీవుడ్ దారుణమైన నిజాలు

టాలీవుడ్ నటుడు జీవన్ తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూ కి హాజరయ్యారు.. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనకొచ్చిన అవకాశాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల గురించి వివరించారు.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే జీవన్ స్టార్ యాక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.. అలాంటి జీవన్ కూడా గతంలో చాలానే అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. అంతేకాదు రెమ్యూనరేషన్ గురించి భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. ఈ ఇంటర్వ్యూలో మీరు మంచి యాక్టర్ కదా ఎందుకు మీరు రెమ్యూనరేషన్ పెంచమని చెప్పలేదు అని యాంకర్ అడిగారు. జీవన్ సమాధానం చెబుతూ.. ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనకి స్టార్ డం వచ్చింది కదా అని రెమ్యూనికేషన్ గురించి అడిగితే మాత్రం అది మొత్తం ఇండస్ట్రీ అంతా పాకిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇస్తున్నారుగా ఇదే ఎక్కువ. మళ్లీ పెంచమని అడగడం తప్పు అని అంటారు. అలా ఒక్కొక్కరి నోటి ద్వారా ఇండస్ట్రీ మొత్తం ఈ విషయం టామ్ టామ్ అయిపోతుంది. ఆ తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసాడు అని పుకార్లు పెరుగుతాయి.. దాంతో మనకు అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు కూడా భయపడిపోతారు. అందుకే నేనెప్పుడూ కూడా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడనని జీవన్ అన్నారు.

టాలెంట్ ఉన్నవారికి మద్దతు: తరుణ్ భాస్కర్ ప్రశంసలు

ఇక తరుణ్ భాస్కర్ తో ఉన్న అనుబంధాన్ని గురించి జీవన్ బయట పెట్టారు. ఇండస్ట్రీలో టాలెంట్ ను నమ్ముకున్న వాడు ఎవడు కూడా చెడిపోయినట్లు చరిత్రలో లేదు అని జీవన్ అన్నారు.. తరుణ్ భాస్కర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు.. నేను ఎప్పటికీ ఆయన రుణాన్ని మర్చిపోను అని జీవన్ చాలా గొప్పగా చెప్పారు.. ఇకపోతే ఆయన వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడిని అని చెప్పుకొచ్చారు.. సమయం దొరికినప్పుడల్లా తిరుమలకు వెళ్తానని అంటున్నారు. అంతే కాదు ఆయనతో పది చైన్లు ఉంగరాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇంటర్వ్యూకి ఎందుకులే అని పెట్టుకో రాలేదు అని ఆయన అన్నారు. చిన్న కమెడియన్ గా ఉన్న ఆయనకు అంత బంగారు ఉండడం అంటే మామూలు విషయం కాదు.. నిజానికి జీవన్ కేవలం సినిమాలు మాత్రమే కాదు వ్యాపారాలు కూడా చేస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు.. సినిమాలు మాత్రమే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తుంటారు.. అదేవిధంగా కొన్ని షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

జీవన్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ విషయంలో చిన్న నటులు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను తెలియజేస్తున్నాయి. టాలెంట్ ఉన్నవారికి మద్దతు అవసరాన్ని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.