
📌 Key Points
- మాధవన్ సాలా ఖడూస్ సినిమా తర్వాత నటన పట్ల నిరాశ చెందారు.
- స్విట్జర్లాండ్ రైతు ప్రశ్నకు మాధవన్ తన పనిని పునరాలోచించుకున్నారు.
- నాలుగు సంవత్సరాలు గ్యాప్ సమయంలో దేశంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
- రణవీర్ సింగ్ నటించిన ధురందర్ సినిమా ప్రమోషన్లలో మాధవన్ తన గ్యాప్ గురించి మాట్లాడారు.
ప్రముఖ నటుడు మాధవన్ ఒకానొక సమయంలో సినిమాలకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అలా విరామం తీసుకోవడానికి గల కారణాన్ని స్వయంగా వెల్లడించారు. ఒక రైతు తన జీవితాన్ని ఎలా మార్చేశాడో తెలిపారు.
మాధవన్ సినీ జీవితంలో అనూహ్య మలుపు
Actor madhavan: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న మాధవన్ (Madhavan)కేవలం తమిళ సినిమాల ద్వారా మాత్రమే కాకుండా తెలుగు సినిమాల ద్వారా కూడా ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. మాధవన్ తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలను చూసి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈయన ఇటీవల ఉన్నఫలంగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మాధవన్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఈయన బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ధురందర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన నటనను కనబరిచి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాధవన్ తన ఇండస్ట్రీకి గ్యాప్ రావడం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను నాలుగు సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి విరామం ఇవ్వడానికి కారణం స్విట్జర్లాండ్ లో ఒక రైతు కారణమని తెలిపారు. తాను హీరోగా నటించిన సాలా ఖడూస్ సినిమా తర్వాత నేను చేస్తున్న పని పట్ల నిరాశ కలిగి విరామం ఇచ్చానని తెలిపారు.
స్విట్జర్లాండ్ రైతుతో మాధవన్ సమావేశం
ఈ సినిమా ఒక సాంగ్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళామని, అక్కడ ఒక పాట షూట్ చేస్తున్న సమయంలో ఒక రైతు నా వంక తదేకంగా చూస్తూ కాస్త అసహనం వ్యక్తం చేశారని మాధవన్ తెలిపారు. ఈ పాట షూటింగ్ విరామ సమయంలో తాను టీ తాగుతూ అసలు సినిమాల పరంగా నేనేం చేస్తున్నాననే విషయాలను ఆలోచించాను. ఆ క్షణం నేను చాలా బాధపడ్డాను నేను ప్రజలను ఆకర్షించడం కోసం ఇతరులు రాసిన పాటకు డాన్స్ చేస్తున్నాను ఇతరుల కథతో నటిస్తాను నాకంటూ కొన్ని మెలకువలు ఉన్నాయి కానీ వాటిని ఏవి నా సినిమాలలో చూపించలేదు. నేను కేవలం ప్రేక్షకులను ఆకర్షించడం కోసమే చేస్తున్నానని విషయాన్ని గ్రహించాను.
ఈ విరామం జీవిత పాఠాలను నేర్పింది..
సినిమాలకు విరామం తర్వాత మాధవన్ ప్రయాణం
ఇలా నా తప్పును నేను తెలుసుకోవడంతో ఇండస్ట్రీకి కాస్త విరామం ఇచ్చి ఈ దేశం ఎటు వెళ్తుందని తెలుసుకోవడం కోసం ప్రయాణం మొదలుపెట్టానని తెలిపారు. ఆ నాలుగేళ్ల కాలంలో తాను ఎలాంటి సినిమాలు చేయలేదు ఎలాంటి ప్రకటనలు చేయలేదు పూర్తిగా గడ్డం పెంచుకొని వివిధ నగరాలలో తిరిగాను ఎంతో మందిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకున్నానని. ఈ నాలుగు సంవత్సరాల పర్యటన నాకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పింది అంటూ మాధవన్ తాను ఇండస్ట్రీకి విరామం ఇవ్వడానికి గల కారణాన్ని అందుకు కారణమైన వ్యక్తి గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మాధవన్ తీసుకున్న ఈ విరామం ఆయన జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. ప్రజల సమస్యలను తెలుసుకొని తిరిగి సినిమాల్లో నటించడం ఆయనకు ఎంతో సంతృప్తినిచ్చింది అని చెప్పవచ్చు.


