
📌 Key Points
- ఎన్టీఆర్-నీల్ సినిమా కోసం రోజుకు కోటిన్నర ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత నవీన్ వెల్లడి.
- జోర్డాన్ షెడ్యూల్ చిత్రీకరణకు భారీగా ఖర్చు చేసిన నిర్మాతలు.
- సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
- మేలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్, గ్లింప్స్ విడుదల కానున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు రోజుకు కోటిన్నర రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
రోజుకు కోటిన్నర ఖర్చు?
Jr.NTR -Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం డ్రాగన్ అనే టైటిల్ తో సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా పట్ల అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకుండా చిత్ర బృందం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.
ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నప్పటికీ చిత్రబంధం మాత్రం ఈ సినిమా విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఇక మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారణాసి తరహాలోనే ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా హై యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది.
జోర్డాన్‌లో షూటింగ్ పూర్తి
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ మైత్రి నిర్మాతలలో ఒకరైన నవీన్ తెలిపారు. ఈయన పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి కీలక అప్డేట్ తెలియజేశారు ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ జోర్డాన్ (Jordan)లో పూర్తి అయిన సంగతి తెలిసిందే .అయితే ఈ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర నిర్మాతలు రోజుకు సుమారు కోటిన్నర వరకు ఖర్చుపెట్టినట్లు నవీన్ తెలిపారు.ఇలా ఈ ఒక్క షెడ్యూల్ కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే విషయాన్ని నిర్మాత తెలియజేయడంతో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్..
హీరోయిన్ గా రుక్మిణి వసంత్
ఇలా ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతున్న నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా అభిమానులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో సినిమా కోసం ఖర్చు చేశారు అంటే కచ్చితంగా సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల జోర్డాన్ షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర బృందం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి కుష్బూ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈమె పాత్రకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో భాగమైనట్టు తెలుస్తుంది.
మొత్తానికి ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


