
📌 Key Points
- ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ మూడేళ్ల గ్యాప్‌కు కారణం తీవ్ర గాయం.
- బాత్రూమ్‌లో పడిపోవడంతో ఎడమ చేతికి 48 కుట్లు, రెండు సర్జరీలు.
- 16 నెలల రికవరీ తర్వాత ‘లెనిన్’ మూవీతో పవర్ ఫుల్ కంబ్యాక్.
- జూలై 10న ‘లెనిన్’ రిలీజ్, ఫ్యాన్స్‌కు అఖిల్ ఇచ్చిన హామీ వైరల్.
అక్కినేని అఖిల్ మూడేళ్ల సుదీర్ఘ విరామంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది! ‘లెనిన్’ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్న అఖిల్, తన గ్యాప్ వెనుక ఉన్న షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో సంచలనం సృష్టిస్తోంది!
అఖిల్ కెరీర్ గ్యాప్‌కు అసలు కారణం ఇదే!
అఖిల్ అక్కినేని సినిమా చేసి చాలా కాలం అవుతోంది. పెళ్ళి తరువాత అసలు తెరపై కనిపించలేదు అఖిల్. అతను ఏమయ్యాడు.. ఎక్కడున్నాడని అభిమానులు వెతుక్కోడం మొదలు పెట్టారు. సినిమాలకు గుడ్ బై చెప్పాడేమో అని చాలామంది అనుకున్నారు. పవర్ ఫుల్ కమ్ బ్యాక్ కోసం ప్రిపేర్ అవుతున్నాడని మరికొందరు అనుకున్నారు. అందరి అనుమానాలు బ్రేక్ చేస్తూ.. త్వరలో లెనిన్ మూవీతో రాబోతున్నాడు అఖిల్. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో రంగంలోకి దిగాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ మూవీ జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్ అంతా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈక్రమంలోనే అఖిల్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత అనుభవాలను కూడా ఆడియన్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో మాట్లాడిన అఖిల్ సినిమాలకు మూడేళ్లు గ్యాప్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చాడు.
రెండు సర్జరీలు, 48 కుట్ల వెనుకటి కథ!
ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను దాదాపు మూడు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాను. దానికి చాలా పెద్ద కారణం ఉంది. ఏజెంట్ రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత నేను తర్వాత ప్రమాదవశాత్తు బాత్రూమ్‌లో జారి పడ్డాను.
ఆ ప్రమాదంలో గాజు ముక్కలు ఎడమ చేతికి గుచ్చుకోవడంతో చాలా పెద్ద గాయం తగిలింది.ఆ గాయం కారణంగా ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఆ ఆపరేషన్ లో మొత్తం 48 కుట్లు పడ్డాయి, గాయం తీవ్రత కారణంగా ఎనిమిది నెలల పాటు బరువులు కూడా ఎత్తలేకపోయాను” అని అన్నాడు.
‘లెనిన్’తో మాస్ కంబ్యాక్‌కు సిద్ధమైన అఖిల్!
అఖిల్ మాట్లాడుతూ.. ”గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 16 నెలల సమయం పట్టింది. అందుకే సినిమాలకు మూడు సంవత్సరాల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ గ్యాప్ కారణంగా అభిమానులు నాపై కోపంగా ఉన్నారని తెలుసు. ఇకపై ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటానని, అభిమానులకు హామీ ఇస్తున్నాను. మళ్ళీ గ్యాప్ వస్తే మా ఇంటికి వచ్చేయండి” అని అఖిల్ హామీ ఇచ్చాడు. అఖిల్ గాయం గురించి తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.
తన కొత్త చిత్రం ‘లెనిన్’ గురించి కూడా అఖిల్ మాట్లాడాడు. ”ఈ సినిమా కథ వినగానే తనకు కొత్త అనుభూతి కలిగింది, అందుకే వెంటనే ఈ ప్రాజెక్టుకు అంగీకరించాను. కథలో ఉన్న కొత్తదనం నన్ను ఆకట్టుకుంది” అని అఖిల్ అన్నారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 10న విడుదల కానున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో కీలకంగా మారనుంది.
అఖిల్ అక్కినేని తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు, ‘లెనిన్’ సినిమాతో భారీ విజయం సాధించడం ఖాయం. అభిమానుల అంచనాలను మించిపోయేలా అఖిల్ కష్టపడ్డారు. మరిన్ని తాజా అప్‌డేట్‌ల కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి!


