|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయ ప్రేమకథ: 16 ఏళ్లకే మొదలైన పోరాటం, అన్నీ త్యజించి గెలిచిన ప్రేమ!

Published: 07-07-2026, 5:48 PM
అనసూయ ప్రేమకథ: 16 ఏళ్లకే మొదలైన పోరాటం, అన్నీ త్యజించి గెలిచిన ప్రేమ!
  • అనసూయ, సుశాంక్ ప్రేమ 16 ఏళ్ల వయసులో ఎన్‌సీసీ క్యాంప్‌లో మొదలైంది.
  • నార్త్, సౌత్ ఇండియన్ బ్రాహ్మణ కుటుంబాల మధ్య పెద్దల వ్యతిరేకత ఎదురైంది.
  • ప్రేమను గెలిపించుకోవడానికి అనసూయ ఏడేళ్లు చాక్లెట్లు, ఆలుగడ్డలు త్యజించింది.
  • ఆర్థిక కష్టాల్లో సుశాంక్ అండగా నిలిచి, ఆమె చదువుకు సాయం చేశాడు.

యాంకర్ అనసూయ భరద్వాజ్ జీవితం, ముఖ్యంగా ఆమె ప్రేమకథ ఎన్నో మలుపులతో నిండి ఉంది. 16 ఏళ్ల వయసులో ఎన్‌సీసీ క్యాంప్‌లో మొదలైన ఆమె ప్రేమ ప్రయాణం, పెద్దల వ్యతిరేకత, ఆర్థిక కష్టాలను ఎలా ఎదుర్కొని గెలిచిందో ఈ కథనంలో చూద్దాం.

ఎన్‌సీసీ క్యాంప్‌లో తొలి పరిచయం

Anasuya LoveStory: యాంకర్ అనసూయ భరద్వాజ్ …ఈ పేరు వినిపిస్తే చాలు బుల్లితెరపై కురిపించిన గ్లామర్ తో పాటు వెండితెరపై రంగమ్మత్తమ్మ చూపించిన నటన కళ్ళ ముందు కనిపిస్తాయి.న్యూస్ రీడర్‌గా  కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ కామెడీ షో ద్వారా స్టార్ డమ్ దక్కించుకున్నప్పటికీ ఈ అమ్మడి ప్రయాణం అంత సులువుగా సాగలేదు. సిల్వర్ స్క్రీన్ పై విభిన్నమైన పాత్రలతో అటు, బుల్లితెరపై సరికొత్త గేమ్ షో లతో అలరిస్తున్న ఈ వెటరన్ బ్యూటీ  జీవితంలో ముఖ్యంగా ఆమె లవ్ స్టోరీలో ఉన్న ట్విస్టులు , విశేషాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.

పదహారేళ్ళ వయసులోనే ncc క్యాంపులో తొలి పరిచయం

అనసూయ  ఫస్ట్ క్రష్, లాస్ట్ క్రష్ అన్ని ఆమె భర్త సుశాంక్ భరద్వాజే.కేవలం పదహారేళ్ళ వయసులోనే ncc క్యాంపులో వీరిద్దరికీ  తొలి పరిచయం ఏర్పడింది.అయితే ఇప్పుడు వదిలితే ఇంకెప్పుడు దక్కదు అన్నట్టుగా  ఎవరికీ మనసు పారేసుకునేంత సమయం కూడా ఇవ్వకుండా సుశాంక్ ఆమె ఆమె హృదయాన్ని దోచేశారు.ఇక  అప్పటికి ప్రేమ అనే పదానికి అర్థం సరిగ్గా తెలియకపోయినా ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు .

అయితే  నార్త్ ఇండియన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుశాంక్ ని , సౌత్ ఇండియన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన  అనసూయ తల్లితండ్రులు  ఒప్పుకోలేదు .అయితే తన ప్రేమను గెలిపించుకోవడం కోసం అనసూయ దేవున్ని  నమ్ముకుందట.చిన్నతనంలోనే తల్లి శుక్రవారాలు, పండుగ రోజుల్లో ఉల్లిపాయ తినకుండా కఠిన నియమాలు పెట్టడంతో అనసూయకి  దేవుని బాగా పూజించడం అలవాటయింది .సంతోషి మాత, సాయిబాబా గుళ్ళకు ఎక్కువగా వెళ్లే ఆమె సుశాంత్ తో తన పెళ్లి జరగాలని బాబాకు ప్రత్యేకంగా మొక్కుకుందట.ఇక ఏడేళ్ల పాటు తనకు ఎంతో ఇష్టమైన చాక్లెట్లు, ఆలుగడ్డలు తినడం పూర్తిగా మానేసింది .అలా 11 వారాలు పాటు కఠిన ఉపవాసాలు ఉంటూ తన పెళ్లికి అందరూ ఒప్పుకోవాలని మొక్కుకుంది అనసూయ.

పెద్దల వ్యతిరేకత, అనసూయ పోరాటం

కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో  అనసూయ ఇంట్లోంచి బయటకు రావాల్సి వచ్చింది.తండ్రి కఠినంగా ఉండటంతో ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది.ఆ సమయంలో సుశాంక్ ఆమెకు కొండంత అండగా నిలిచాడు .ఇంట్లో వాళ్ళు ఫీజులు కట్టకపోతే తన అన్నయ్య యూకె నుంచి పంపించిన ఖరీదైన మొబైల్ అమ్మేసి సుశాంక్ ఆమె ఎంబీఏ చదువుకు ఫీజులు కట్టాడట .ఆ రోజుల్లో అనసూయ హాస్టల్ లో ఉంటూ ఆ తర్వాత బసవతారకం హాస్పిటల్  వెనుక ఉన్న ఒక చిన్న స్లమ్  ఏరియాలోని రెండు గదులు పెంట్ హౌస్ లో ఒంటరిగా నివసించింది  అనసూయ.అలా సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా  ఉద్యోగం చేసినప్పుడు కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది.

తర్వాత ఎట్టకేలకు 2010లో  రెండు కుటుంబాలని  ఒప్పించి  సుశాంక్ తో పెళ్లి పీటలు ఎక్కింది అనసూయ.పెళ్లి పీటల మీద కూర్చునే వరకు సుశాంక్ కులం ఏంటో కూడా తనకు తెలియదని   అనసూయ ఓ  సందర్భంలో చెప్పుకొచ్చింది. పెళ్ళై ఇన్ని ఏళ్లయినా  వారి బంధం ఎంతో సాపిగా సాగుతుండం విశేషం.

‘ముందు మనమిద్దరం.. ఆ తర్వాతే ఎవరైనా

ఆర్థిక కష్టాల్లో సుశాంక్ అండ

ఇక “మా మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలకు మేమైతే ప్రతివారం విడాకులు తీసుకుంటాం  అంటూ సరదాగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.ఇక  వారి మధ్య ఇలాంటి వ్యక్తిగత కంప్లైంట్స్ ఉండవని ఎప్పుడు గొడవలు వచ్చినా అవి మూడో  వ్యక్తి వల్లే వస్తాయని, కానీ వెంటనే రియల్ ముందు రియలైజ్ అయ్యి ‘ముందు మనమిద్దరం.. ఆ తర్వాతే ఎవరైనా అని ఒకరికొకరం  అర్థం చేసుకుంటామని చెప్పుకొచ్చింది.

ఇక అనసూయ ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటే,సుశాంక్ మాత్రం సెలబ్రిటీ  లైఫ్ కి చాలా దూరంగా ఉంటాడు .ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయన ఒక ప్రొఫెషనల్ బైకర్ మరియు మోటార్ సైకిల్ క్లబ్ నెంబర్.అత్యంత కాస్ట్లీ బైక్స్ పై  తోటి రైడర్స్ తో కలిసి ఇహిల్ స్టేషన్లకు లాంగ్ రైడ్స్ వెళ్లడం ఆయనకు అలవాటు.అంతేకాదు అనసూయ పుట్టినరోజు అయిన మే 15 నాడు, వారి పెద్ద కొడుకు పుట్టినరోజుకి ఓ హిల్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు సుశాంక్‌లోని మరో కోణం బయటపడింది. క్యాంప్ ఫైర్ నైట్‌లో గిటార్ వాయిద్యానికి తగ్గట్టుగా ఒక మంచి మెలోడీ సాంగ్ ని పాట పాడి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇక అనసూయ  ఓ సందర్భంలో మాట్లాడుతూ  భవిష్యత్తులో తన దగ్గర బాగా డబ్బులు ఉంటే తన లవ్ స్టోరీ ని బేస్ చేసుకుని ఒక బయోపిక్ తీస్తానని చెప్పుకొచ్చింది. ఎన్సిసి క్యాంపు పరిచయము, ప్రేమ పెళ్ళికి  పెద్దల వ్యతిరేకత, పెంట్ హౌస్ కష్టాలు ఇలా అన్నీ తన లైఫ్ లో సినిమాకు కావాల్సినంత మసాలా మరియు ఎంటర్టైన్మెంట్ ఉందని అసలు విషయం చెప్పుకొచ్చింది ఈ వెటరన్ బ్యూటీ.

అనసూయ, సుశాంక్ ప్రేమకథ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలిచింది. వారి బంధం కేవలం ప్రేమ మాత్రమే కాకుండా, ఒకరికొకరు అండగా నిలబడిన స్ఫూర్తిదాయక ప్రయాణంగా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.