
📌 Key Points
- నటుడు అమ్మ రమేష్.. కిరణ్ అబ్బవరంను పవన్ కళ్యాణ్ తో పోల్చారు.
- కిరణ్ అబ్బవరం తోటి నటులకు సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి అని రమేష్ అన్నారు.
- తిమ్మరాజు పల్లి టీవీ సినిమాలో కిరణ్ అబ్బవరం నటనను రమేష్ కొనియాడారు.
- ఏప్రిల్ 17న విడుదల కానున్న ‘తిమ్మరాజు పల్లి టీవీ’ సినిమా.
సినీ నటుడు అమ్మ రమేష్.. కిరణ్ అబ్బవరంను పవన్ కళ్యాణ్ తో పోల్చడం హాట్ టాపిక్ గా మారింది. కిరణ్ ఇండస్ట్రీలో ఎంతో మందికి సహాయం చేస్తున్నాడని, అందుకే ఆయన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అని రమేష్ అన్నారు.
కిరణ్ అబ్బవరంపై అమ్మ రమేష్ ప్రశంసలు
Amma Ramesh: సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతూ పలు సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన వారిలో నటుడు అమ్మ రమేష్(Amma Ramesh) ఒకరు. ఒకానొక సమయంలో ఎన్నో సినిమాలు సీరియల్స్ చేసిన ఈయన ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరమయ్యారు. చాలా రోజుల తర్వాత నటుడు అమ్మ రమేష్ తిమ్మరాజు పల్లి టీవీ (Timmarajupalli Tv)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా తిమ్మరాజు పల్లి టీవీ సినిమా నటీనటులు మొత్తం పాల్గొన్నారు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన నటుడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గురించి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో పదిమందికి సహాయం చేయాలని కోరుకొని మంచి మనసున్న వ్యక్తి అని తెలిపారు. కిరణ్ అబ్బవరం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు.
పవన్ కళ్యాణ్ తో పోల్చడానికి కారణం ఇదే!
పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలో చెల్లెల కోసం ఎంత ఆరాట పడతారో కిరణ్ అబ్బవరం కూడా ఆర్థిస్టుల కోసం అంతే ఆరాట పడతారని తెలిపారు. నలుగురికి ఉపాధి కల్పించాలన్న ఆరాటం కిరణ్ అబ్బవరంలో ఉందంటూ అమ్మ రమేష్ ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం పై ప్రశంసల కురిపించడమే కాకుండా ఇలాంటి గొప్ప వ్యక్తిని కన్న తల్లికి వందనాలు అంటూ శిరస్సు వంచి వేదికపై నమస్కారం చేశారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం గురించి అమ్మ రమేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టారు. సినిమాలంటే ఆసక్తితో చేసే ఉద్యోగం కూడా మానేసి ఈయన సినిమాల వైపు వచ్చారు.
నిర్మాతగా మారిన కిరణ్ అబ్బవరం..
తిమ్మరాజు పల్లి టీవీ సినిమా విశేషాలు
ఇలా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటూ నేడు హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం తిమ్మరాజు పల్లి టీవీ. సాయి తేజ్ (Sai Tej)వేద జలంధర్(Veda Jalandhar) హీరో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమాకు వి.మునిరాజు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇలా కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ కిరణ్ అబ్బవరం పలువురికి ఉపాధి కల్పించడంతోనే కిరణ్ అబ్బవరం పై నటుడు అమ్మ రమేష్ ప్రశంసల కురిపించారని చెప్పాలి. ఇక ఈ సినిమా 1990 కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా సినిమా మొత్తం టీవీ నేపథ్యంలోనే కొనసాగుతుందని తెలుస్తోంది. ఏప్రిల్ 17వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
అమ్మ రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరం కొత్త వారికి అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


