|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భాగ్యశ్రీ నోట అన్నగారి డైలాగ్.. అఖిల్ ‘లెనిన్’ ప్రీ రిలీజ్ లో సంచలనం!

Published: 06-07-2026, 12:04 AM
భాగ్యశ్రీ నోట అన్నగారి డైలాగ్.. అఖిల్ 'లెనిన్' ప్రీ రిలీజ్ లో సంచలనం!
  • మోడల్ గా కెరీర్ ప్రారంభించి తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ తో పరిచయం.
  • అఖిల్ ‘లెనిన్’ సినిమాలో కీలక పాత్రలో భాగ్యశ్రీ బోర్సే.
  • తిరుపతిలో ఘనంగా జరిగిన ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.
  • ఎన్టీఆర్ ‘ఏమంటివి.. ఏమంటివి’ డైలాగ్ తో భాగ్యశ్రీ అదరగొట్టిన తీరు.

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణలోని ‘ఏమంటివి.. ఏమంటివి’ డైలాగును చెప్పి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

భాగ్యశ్రీ సినీ ప్రస్థానం, ‘లెనిన్’ అవకాశం

Bhagyashri Borse: మోడల్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన పూణే ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తొలిసారి హిందీలో యారియాన్ 2 చిత్రంలో నటించి, ప్రేక్షకులను పలకరించిన ఈమె తొలిసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహా మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 2024 లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా.. భాగ్యశ్రీ మాత్రం తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా హిందీ అమ్మాయి అయినప్పటికీ తన తొలి చిత్రానికి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం. అలా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఆ తర్వాత కింగ్డమ్ అనే మరో తెలుగు చిత్రంలో నటించినది. ఇక చివరిగా రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో నటించిన ఈమె.. ఇప్పుడు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

అక్కినేని అఖిల్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఇప్పటికే ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ ని మూటగట్టుకున్న అఖిల్ కెరీర్లో లెనిన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పాలి. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న అఖిల్.. ఈ సినిమాతో దుమ్ము దులపడం ఖాయం అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయడమే కాకుండా అఖిల్ లోని ఒక కొత్త నటుడిని ఈ చిత్రం బయటకు తీసింది. జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నేడు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

అఖిల్ ‘లెనిన్’ పై భారీ అంచనాలు

చిత్తూరు జిల్లా తిరుపతి వేదికగా.. నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం అయింది. ముఖ్యంగా కింగ్ నాగార్జున ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి సందడి చేశారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగ్యశ్రీ బోర్సే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే కాదు తన డైలాగ్ డెలివరీతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగ్యశ్రీ సందడి

ఎన్టీఆర్ డైలాగ్ ను శివాజీ తో పాటు పోటీ పడుతూ చెప్పిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన దానవీరశూరకర్ణ లోని “ఏమంటివి ఏమంటివి” అనే డైలాగును గుక్క తిప్పుకోకుండా ప్రముఖ నటుడు శివాజీ తో కలసి చెప్పి అందరి చేత ఔరా అనిపించుకుంది. ముఖ్యంగా ఈ ఈవెంట్లో బ్లూ కలర్ చీర కట్టుకొని గ్లామర్ తో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా తన అద్భుతమైన డైలాగు డెలివరీతో అందరినీ ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఏది ఏమైనా పూణే అమ్మాయి అయినప్పటికీ తెలుగులో అత్యంత క్లిష్టమైన డైలాగ్స్ ను ఏ మాత్రం ల్యాగ్ చేయకుండా చెబుతూ.. అందరి దృష్టిని ఆకర్షించింది భాగ్యశ్రీ. ప్రస్తుతం ఈమె చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భాగ్యశ్రీ కేవలం తన అందంతోనే కాకుండా, డైలాగ్ డెలివరీతోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన ‘లెనిన్’ సినిమాపై మరింత ఆసక్తిని పెంచడమే కాకుండా, ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.