|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడో పాట: దుమ్ము రేపే లిరిక్స్, విడుదల ఎప్పుడంటే?

Published: 10-03-2026, 3:35 AM
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూడో పాట: దుమ్ము రేపే లిరిక్స్, విడుదల ఎప్పుడంటే?
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం.
  • మూడో సింగిల్ ప్రోమో విడుదలతో అభిమానుల్లో ఉత్సాహం.
  • పాటలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణానికి అద్దం పట్టే లిరిక్స్.
  • మార్చి 12న పూర్తి పాట విడుదల కానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సినిమాలోని మూడో సింగిల్ విడుదల గురించి తాజాగా ఒక అప్‌డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.

మూడో సింగిల్ ప్రోమో విడుదల

Ustaad Bhagat Singh Third Single: టాలీవుడ్ సెన్సేషనల్ కాంబో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్లీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాల్సిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాబోయే మూడో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ షేర్ చేసిన లిరిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హరీష్ శంకర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పంక్తులు పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ఆటిట్యూడ్‌కు, ఆయన రాజకీయ ప్రయాణానికి అద్దం పట్టేలా ఉన్నాయి. “ఎక్కే, దిగే కిక్కులోన దక్కేదేముందే… అరె సచ్చే దాకా కిక్కే ఉండాలే…. ఎక్కీ తొక్కేటోల్లే ఉంటే తగ్గేదేముందే… >నెగ్గే దాకా తిక్కే ఉండాలే..” ఈ లిరిక్స్‌లో ‘తిక్క’ అనే పదాన్ని వాడటం ద్వారా పాత ‘గబ్బర్ సింగ్’ వైబ్స్‌ను హరీష్ గుర్తు చేశారు. “నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది” అన్న డైలాగ్ అప్పట్లో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు “నెగ్గే దాకా తిక్కే ఉండాలే” అనే లైన్ అంతకంటే పవర్‌ఫుల్‌గా సాగుతుందని అర్థమవుతోంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలై చాట్ బాస్టార్లు గా మారాయి. తాజాగా మూడో పాటకు సంబంధించి ఈ రోజు ప్రోమో విడుదల కానుంది. పూర్తి సాంగ్ కోసం మార్చి 12 వరకూ ఆగాల్సిందే.

Read also- Richest Actresses: టాప్ 10 అత్యధిక ధనవంతుల జాబితా.. మీ ఫేవరెట్ హీరోయిన్ ఆస్తి ఎంతంటే?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో “ఎక్కీ తొక్కేటోల్లే ఉంటే తగ్గేదేముందే” వంటి పంక్తులు ఆయన ప్రత్యర్థులకు ఇచ్చే కౌంటర్లలా ఉన్నాయని అభిమానులు చర్చించుకుంటున్నారు. హరీష్ శంకర్ ఎప్పుడూ తన సినిమాలో హీరో వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండేలా పాటలను, డైలాగులను మలుస్తారు. ఈ మూడో సింగిల్ కూడా పక్కా మాస్ బీట్‌తో ఉండి, థియేటర్లలో ఫ్యాన్స్‌తో స్టెప్పులు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది.

పాటలోని పవర్ఫుల్ లిరిక్స్

Read also- Aspirants Season 3 OTT : మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ… స్టోరీ అంతా ఐఏఎస్ ల చుట్టూనే

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మ్యూజిక్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రాబోయే ఈ పాట యూత్ మరియు మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎనర్జీకి సరిపోయే హై-వోల్టేజ్ సాంగ్‌గా ఇది నిలవబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కమిట్‌మెంట్స్ మధ్యలో కూడా ఈ సినిమా కోసం కేటాయించే సమయం ఫ్యాన్స్‌కు పండగే. హరీష్ శంకర్ ఇచ్చిన ఈ క్రేజీ అప్‌డేట్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడో సింగిల్ కోసం నిరీక్షణ మరింత పెరిగింది. ఈ పాట విడుదలయ్యాక రికార్డుల వేట మొదలవడం ఖాయం!

From today evening, get ready to raise your collars and do the energetic hookstep with our PowerStar 🤩 #UstaadBhagatSingh third single #CollarEyEthara Song promo today at 4:36 pm 🕺🔥

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం

Let’s celebrate the full song on March 12 with a massive event at the Biggest Single Screen… pic.twitter.com/f2edAOD1Wu

— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 10, 2026

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని మూడో పాట పక్కా మాస్ బీట్‌తో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ పాట థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి 12న పాట విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.