|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దసరా బరిలో స్టార్ల సమరం: బాక్సాఫీస్ వద్ద డబ్బుల వర్షం కురిసేనా, జేబులు ఖాళీ అయ్యేనా?

Published: 08-07-2026, 7:01 AM
దసరా బరిలో స్టార్ల సమరం: బాక్సాఫీస్ వద్ద డబ్బుల వర్షం కురిసేనా, జేబులు ఖాళీ అయ్యేనా?
  • ఈ దసరా సీజన్‌లో నలుగురు పెద్ద హీరోల సినిమాలు విడుదల కానున్నాయి.
  • సెప్టెంబర్ 25న నాని ‘ప్యారడైజ్’ (Dasara) సినిమాతో బరిలోకి దిగనున్నాడు.
  • అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ (Saindhav) విడుదల కానుంది.
  • ఒకేసారి పలు పెద్ద సినిమాలు రావడంతో ప్రేక్షకులకు ఏ సినిమా చూడాలనే ఎంపిక కష్టంగా మారింది.

ఈ దసరా సీజన్ తెలుగు సినిమా ప్రేక్షకులకు పండగే పండగ! బాక్సాఫీస్ వద్ద బడా హీరోల సినిమాలతో సందడి నెలకొననుంది. నాని, వెంకటేష్ వంటి స్టార్ల చిత్రాలు ఒకేసారి విడుదలవుతుండటంతో, అభిమానులు ఏ సినిమా చూడాలనే గందరగోళంలో పడ్డారు. ఈ పోటీలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి.

దసరా బరిలో స్టార్ల సందడి

Dasara Clash: బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే అయితే అతి వృష్టి లేకపోతె అనావృష్టి అన్నట్టుగా ఉంది.అవును ..ఒకసారి ఏ సినిమాలు లేక కరువుతో అల్లాడిపోతుంటే, మరోసారి ఇబ్బడి ముబ్బడి సినిమాలతో వరదలా నిండిపోతుంది.అవును ఈ సీనే ఈ ఏడు దసరా సీజన్ లో రిపీట్ కాబోతుంది మరి. వస్తే గంప గుత్తగా  ఒకేసారి వస్తాం,లేకపోతె అస్సలు కనిపించము అనంట్టుగా ఉంది మన వాళ్ళ వ్యవహారం. ఈ దసరా సీజన్ అంటే సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మూడో వారం వరకు థియేటర్లపై ఏకంగా నలుగురు పెద్ద హీరోలు తమ సినిమాలతో ఎటాక్ చేయబోతున్నారు మరి.దీంతో ఇలా ఒకేసారి నలుగు హీరోలు ఒకరి వెనుక ఒకరు క్యూ కడితే ఆడియన్స్ కి ఎ సినిమా చూడాలా , ఏ సినిమా వదిలేయాలా అన్న కన్ఫ్యూజన్  స్టార్ట్ కాబోతుంది.

ముందుగా ఈ దసరా సీజన్ ని నా సినిమాతో మొదలెట్టేస్తా అంటున్నాడు హీరో నాని. ఇప్పటికే రెండు మూడు సార్లు సినిమా వస్తుందని అనౌన్స్ చేసి తీరా సమయానికి వాయిదాల పాట పాడిన నని ఇపుడు ఎత్తి పరిస్థితుల్లో దసరా బరిలో తన ప్యారడైజ్ ని దించాలని ఫిక్స్ అయిపోయాడట. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో, సికింద్రాబాద్ స్లమ్స్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 25న బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.నిజానికి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం దసరా సీజన్ సెలవులని క్యాష్ చేసుకోవడానికి స్కెచ్ వేసే పనిలో నాని పడ్డాడని సమాచారం.ఇక ఇదే కాంబోలో వచ్చిన దసరాలో నాని రగ్గుడ్ లుక్ లో మెప్పించగా ఈ సారి జడల్ పాత్రలో హడల్ గొడతానని రెడీ అయిపోయాడు.నిజానికి అనుకున్నట్టుగా పండగ సీజన్ లో గనుక ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ సినిమా వస్తే మాత్రం కాసులు కురవడం ఖాయం.

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా

నాని ‘ప్యారడైజ్’ వర్సెస్ వెంకీ ‘ఆదర్శ కుటుంబం’

ఇక నాని తర్వాత వేయబోయే ఖర్చీఫ్ నాదే అంటున్నాడు మన వెంకీ మామ.అవును త్రివిక్రమ్ దర్శకత్వంలో  వెంకీ హీరోగా వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్  చేసింది  మూవీ టీమ్ .సో ఈ సినిమాకి  గాంధీ జయంతి లాంగ్ వీకెండ్ బాగా ప్లస్ కానుందనడంలో సందేహం లేదు.ఇక మాములుగా తెలుగు రాష్ట్రాలలో ఏ పెద్ద పండగ వచ్చినా ప్యామిలీలు అన్నీ కలిసి థియేటర్ లలోకి వెళ్ళడం ఖాయం.సరిగ్గా అడాన్నే క్యాష్ చేసుకుకోవాలని చూస్తున్నాడు మన గురూజీ.అంటే ఒక పక్క నాని ప్యారడైజ్ తో మాంచి మాస్ విందు ఇస్తుంటే మరో పక్క వెంకీ మామ ఆదర్శకుటుంబంతో కొత్త ఆవకాయన్నం తినిపించబోతున్నాడన్న మాట.

ఒక్క రోజు గ్యాప్ లో రెండు సినిమాలు

ఇక వీరి సంగతి ఇలా ఉంటె అసలు సిసలైన బాక్సాఫీస్ బ్యాటిల్ వార్ మొదలయ్యేది అక్టోబర్ రెండో వారంలోనే. సూపర్ స్టార్ రజిని తన క్రేజీ సీక్వెల్ అయిన జైలర్ 2 ని  అక్టోబర్ 15న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా. ఒక దీనికి ఒక రోజు గ్యాప్ అంటే అక్టోబర్ 16న చిరంజీవి విశ్వంభర థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్న ప్రచారం జోరందుకుంది.ఒకవేళ అనుకుంటున్నట్టుగానే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగితే మాత్రం చిరు ,రజినిల మధ్య పోటీ మహా రంజుగా ఉంటుంది అన్నది వాస్తవం.

ప్రేక్షకుల జేబులకు చిల్లు పడేనా?

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈసారి దసరా సీజన్ లో ఎటాక్ చేయబోతున్న ఈ నాలుగు సినిమాలు ఒకదానికి ఒకటి సంబంధం లేని జానర్లు కావడమే. ఒక రా యాక్షన్ డ్రామా, ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామా, ఒక ఊరమాస్ సీక్వెల్, ఇంకొకటి మైండ్ బ్లోయింగ్ విజువల్ ఫాంటసీ.అయితే  సినిమాల మధ్య సరైన గ్యాప్ ఉండటం వల్ల ఒకదాని కలెక్షన్స్‌కి ఇంకొకటి గండి కొట్టే ఛాన్స్ తక్కువగా ఉందని చెప్పాలి.. అయితే, నెల రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద ఇంతటి దండయాత్ర జరిగితే ప్రేక్షకుల జేబులకు మాత్రం చిల్లు పడటం గ్యారెంటీ అంటున్నారు ట్రేడ్ పండితులు.చూడాలి మరి ఈ బాక్సాఫీస్ బ్యాటిల్ లో ఏది సత్తా చాటుతుందో !

మొత్తానికి, ఈ దసరా సినీ ప్రియులకు టికెట్ల కోసం జేబులు ఖాళీ చేసేలా ఉంది. ఒకేసారి ఇన్ని పెద్ద చిత్రాలు విడుదల కావడం బాక్సాఫీస్‌కు లాభం చేకూర్చినా, ప్రేక్షకుల ఎంపికను మాత్రం కష్టతరం చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.