|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డీప్‌ఫేక్‌పై ప్రీతి జింతా పోరు: టెక్ దిగ్గజాలపై కోర్టుకెక్కిన బాలీవుడ్ బ్యూటీ!

Published: 08-07-2026, 7:01 AM
డీప్‌ఫేక్‌పై ప్రీతి జింతా పోరు: టెక్ దిగ్గజాలపై కోర్టుకెక్కిన బాలీవుడ్ బ్యూటీ!
  • డీప్‌ఫేక్ టెక్నాలజీ సెలబ్రిటీల పరువుకు భంగం కలిగిస్తోంది.
  • ప్రీతి జింతా తన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల తొలగింపుకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
  • గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలను కేసులో ప్రతివాదులుగా చేర్చింది.
  • అభ్యంతరకర కంటెంట్ తొలగింపునకు ప్రాక్టికల్ ప్రోటోకాల్ రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది.

డీప్‌ఫేక్ టెక్నాలజీ సెలబ్రిటీలకు పెద్ద సమస్యగా మారింది. బాలీవుడ్ నటి ప్రీతి జింతా తన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను తొలగించాలని కోరుతూ గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలపై బాంబే హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

డీప్‌ఫేక్: సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు

Deepfake Case : డీప్ ఫేక్ ….ఈ పదం ఇపుడు సెలెబ్రెటీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తుంది.ముఖ్యంగా హీరోయిన్స్ పాలిట ఇదొక బూతం లా తయారైంది.ఈ టెక్నాలజీతో వస్తున్న ఫోటోలని, నిజమైన ఫోటోలని పక్క పక్కన పెడితే ఏది నిజమో ఏది ఫేకో తెలుసుకోలేనంతగా మార్పింగ్ చేస్తున్నారంటే ఈ టెక్నాలజీ ఎంతలా అడ్వాన్స్డ్ గా డిజైన్ చేయబడిందో అర్థం అవుతుంది.

ఇపుడు ఇదే డీప్ ఫేక్ నా పరువుకి భంగం కలిగిస్తుందని ఇలా డీప్ ఫేక్ చేస్తున్న వారిపై అలాగే నెట్టింట్లో తనపై చేసిన వేలాది మార్ఫింగ్ ఫోటోలని అరికట్టాలంటూ బాంబే హైకోర్టు తలుపు తట్టింది ప్రీతి జింతా.ఇందులో సర్క్యులేట్ అవుతున్న మార్ఫింగ్ లింక్ ,ఫేక్ వీడియోలని తొలగించేలంటూ  గూగుల్, మెటా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లను కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చింది ఈ బాలీవుడ్ వెటరన్ బ్యూటీ.

విచ్చలవిడిగా పెరిగిన టెక్నాలజీతో అసలు ఏది నిజమో, ఏది అబద్దమో గుర్తించడం కామన్ మ్యాన్ కే కాకుండా, సెర్చ్ ఇంజిన్లకి కూడా కష్టంగా మారిపోయిందని ,ఇలా వ్యక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ మార్ఫింగ్ కంటెంట్ ని ఇంటర్ నెట్ నుండి కంప్లీట్ గా తొలగించాలని వాదించారు సీనియర్ న్యాయవాది వెంకటేశ్ ధోండ్.

ప్రీతి జింతా పోరాటం: టెక్ దిగ్గజాలపై కేసు

ఇక కేసుని పరిగణలోకి తీసుకున్న బాంబే హైకోర్టు పలు సెన్సేషన్ కామెంట్స్ చేసింది.ఇంటర్ నెట్ నుండి ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్ ని తొలగించడానికి ఒక ఒక ఆచరణాత్మక విధానాన్ని (ప్రాక్టికల్ ప్రోటోకాల్‌) తీసుకురావాలని టెక్ సంస్థలను ఆదేశించింది.అయితే దీనిపై గూగుల్, మెటా సంస్థల ప్రతినిధులు స్పందిస్తూ, బాధితురాలికి నష్టం చేకూర్చే వివాదాస్పద లింకులను డిలీట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

అయితే అదే సమయంలో లో రెగ్యలర్ గా లీగల్ గా ఉండే కంటెంట్ కి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని, ముందస్తుగా కఠినమైన ఫిల్టర్లు పెడితే మిగతా వారు ఇబ్బంది పడే అవకాశము ఉందని తెలిపారు .దీంతో రెండు వైపు వాదనలు విన్న న్యాయమూర్తి కేవలం అభ్యంతరకర లింకులను మాత్రమే టార్గెట్ చేస్తూ వేగంగా తొలగించే సమర్థవంతమైన ప్రోటోకాల్ సిద్ధం చేయాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.

బాంబే హైకోర్టు ఆదేశాలు: పరిష్కారం ఏంటి?

ఇక ప్రీతి జింతా విషయానికి వస్తే ‘దిల్ సే’, ‘కల్ హో నా హో’, ‘వీర్ జారా’  వంటి ఎన్నో గొప్ప సినిమాలలో నటించి వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటిన సంగతి తెల్సిందే.ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ-యజమానిగా స్టేడియంలో ప్రీతి ఎలాంటి హడావిడి చేసేదో చెప్పక్కర్లేదు.చూడాలి మరి డీప్ ఫేక్ తో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఏంతో మంది సెలెబ్రెటీలకి ఈ బాంబే హైకోర్ట్ ఎలాంటి ఊరటనిస్తుందో !

డీప్‌ఫేక్ కంటెంట్‌ను సమర్థవంతంగా తొలగించడానికి ఒక ప్రోటోకాల్ అవసరాన్ని ఈ కేసు నొక్కి చెప్పింది. టెక్ దిగ్గజాలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, చట్టబద్ధమైన కంటెంట్‌కు ఆటంకం కలగకుండా చూడటం సవాలుగా మారింది. తదుపరి విచారణలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.