
📌 Key Points
- ఉప్పల్ బాలు అనంతగిరి ఘాట్ రోడ్డుపై థార్ స్టంట్స్ చేసి వైరల్ అయ్యారు.
- తన స్టంట్స్‌పై వచ్చిన విమర్శలకు బాలు ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
- బిగ్ బాస్ 10లోకి వెళ్లాలని వికారాబాద్ గుడిలో మొక్కుకున్నట్లు బాలు వెల్లడించారు.
- బాలు బిగ్ బాస్‌లోకి వస్తే హౌస్ రచ్చ రచ్చ అవుతుందని నెటిజన్లు అంటున్నారు.
సోషల్ మీడియా సంచలనం ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడా? అనంతగిరి ఘాట్ రోడ్డుపై థార్ స్టంట్స్‌తో వివాదాల్లో చిక్కుకున్న బాలు, బిగ్ బాస్ 10లో కంటెస్టెంట్‌గా వెళ్లాలని మొక్కుకున్నట్లు వెల్లడించారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఉప్పల్ బాలు: వివాదాల నుంచి బిగ్ బాస్‌కు?
Uppal Balu: ఉప్పల్ బాలు …సోషల్ మీడియాని వాడే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. తనదైన ఎక్స్ప్రెషన్స్ తో, వాయిస్ తో బాగా పాపులర్ అయిన బాలు వికారాబాద్‌లోని ప్రసిద్ధ అనంతగిరి ఘాట్ రోడ్డుపై థార్ కార్ పై ఎక్కి చేసిన స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే.దీంతో ప్రసిద్ద పుణ్య క్షేత్రంలో ఈ ఆటలు ఏంటి అంటూ, ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు కూడా.
అయితే తాజాగా ఇదే విషయంపై స్పందించాడు ఉప్పల్ బాలు.ఒక చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలు మాట్లాడుతూ వెన్నచేడు మా ఊరని,అక్కడ లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తూ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని,పెట్టిస్తున్నానని, అందులో భాగంగా అన్నదానం కూడా చేయిస్తున్నాని.. అయితే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయి జులై 5 కి పోస్ట్ పోన్ అయిందని తెలిపాడు. ఇక తన సొంత ఊరికి చాలా రోజుల తర్వాత వెళ్ళడంతో సెలెబ్రిటి అయ్యాక అసలు రావడం లేదని అనడంతో వారిని కలిసి తనకి ఇష్టమైన దేవుడి గుడిని దర్శించుకుని వెళ్లామని అలా కాస్త ముందుకు వెళ్ళగా అక్కడ ఘాట్ రోడ్ ప్లేస్ మంచిగా అనిపించడంతో మా బావ కొత్త కార్ లో అలా సరదాగా స్టంట్స్ చేశామని తెలిపాడు.
ఘాట్ రోడ్డు స్టంట్స్: బాలు వివరణ ఏంటి?
ఇక దాన్ని చూసి చిన్న పిల్లలు ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకి సమాధానంగా అసలు నేను వేరేదేమీ ఆలోచించలేదని, కేవలం ఆ సమయంలో మాకు ఆ ఆలోచన వచ్చింది కాబట్టే అలా చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఇలా చేయడం తప్పుకాదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పటికి ఇలా ఎంత మంది చేయలేదని,కొంతమంది అయితే ఏకంగా చేతులు వదిలేసి పోటీలు పడుతూ మరీ రేసులల్లో పాల్గొంటారని చెప్పుకొచ్చాడు.ఇక పొలిటికల్ లీడర్లు కూడా అప్పుడప్పుడు ఇలానే చేస్తుంటారని,తనని తాను సమర్దించుకున్నాడు. అయితే ఇలా పోలీసులు కేసులు పెడతారన్న విషయం తెలీదా అన్న ప్రశ్నకి సమాధానంగా నాకు అదేమీ తెలీదని, ఇక ఇప్పటి వరకు నన్నెవరు అరెస్ట్ చేయలేదని తెలిపాడు.
బిగ్ బాస్ ఎంట్రీపై నెటిజన్ల స్పందన
ఇక తాను వికారాబాద్ గుడికి వెళ్ళిందే తను బిగ్ బాస్ 10 కి సెలెక్ట్ చేసెలా చేయ్యుమని మొక్కుకునేందుకు అంటూ మనసులోని మాటని బయటపెట్టాడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్.ఇక బాలు ఇలా ఇంటర్వ్యూలో తన మాటని బయట పెట్టాడో లేదో సోషల్ మీడియాలో బాలుకి సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఒకవేళ ఉప్పల్ బాలు గనుక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే రచ్చ మాములుగా ఉండదని, అందరిని వెనక్కి నెట్టి ఉప్పల్ బాలుయే విన్నర్ అవడం పక్కా అంటూ మరికొంతమంది ఆకాశానికి ఎత్తేస్తున్నారు .చూడాలి మరి ఎన్నో ఏళ్లుగా బిగ బాస్ పై దండయాత్ర చేస్తున్న బాలు ఈ సరైనా సక్సెస్ అవుతాడో లేదో !
ఉప్పల్ బాలు బిగ్ బాస్‌లోకి వస్తే, హౌస్‌లో వినోదం, వివాదాలు ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు. అతని ప్రత్యేకమైన శైలి, నిర్మొహమాటమైన మాటలు షోకు కొత్త రంగులద్దడం ఖాయం.


