
📌 Key Points
- యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై సీరియల్ నటుడు ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు!
- బూతు పాట వివాదంపై ప్రభాకర్ స్పందన: పెంపకాన్ని తక్కువ చేయొద్దన్న నటుడు!
- సమాజాన్ని ఉద్దరిద్దామని చూసి నాశనం చేస్తున్నారని ప్రభాకర్ ఆవేదన!
- తప్పును ఎత్తి చూపే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తున్నారు: ప్రభాకర్
టాలీవుడ్ లో మరో సంచలనం! నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ పాడిన బూతు పాట సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీనిపై ప్రభాకర్ ఎలా స్పందించారో తెలుసా? పూర్తి వివరాల కోసం చదవండి!
చంద్రహాస్ పాటపై ప్రభాకర్ సీరియస్ కామెంట్స్!
తన కుమారుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పాడిన బూతు పాట వివాదంపై సీరియల్ నటుడు ప్రభాకర్ స్పందించారు. చిన్నపొరపాటుతో తన పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని అన్నాడు. పబ్లిక్ గా బూతులు మాట్లాడటం తప్పే అని అన్నారు. ఆ పాట సగం పాడిన తరవాత తాను ఈవెంట్ కు వెళ్లానని పాట పూర్తైన తరవాత ఇలా బూతులు మాట్లాడటం తప్పని చెప్పానని అన్నారు. పర్సనల్ గా చెప్పడంతో అది బయటకు రాలేదన్నారు. ఆ పాటను ఈవెంట్ లో వెయ్యి మంది చూశారని, లైవ్ కావడంతో అప్పటికే బయటకు వెళ్లిపోయిందని అన్నారు. దానిని ముక్కులుగా చేసి మళ్లీ టెలికాస్ట్ చేసి ఇంకా ఎక్కువ మందికి వినిపిస్తున్నారని అన్నారు.
బాధ్యతగా వ్యవహరించాలని అనుకున్నప్పుడు లీగల్ యాక్షన్ తీసుకోవాలని కానీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయకూడదన్నారు. సమాజాన్ని ఉద్దరిద్దమాని బయలుదేరి ఇంకా ఎక్కువ నాశనం చేస్తున్నారని అన్నారు. తన భార్య, కుమార్తె అక్కడ లేకపోయినా చాలా మంది వాళ్లను చాలా మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కూడా చాలా మంది తిట్టారని పెంచడం రాదా అని మాట్లాడారని అన్నారు. తన పెంపకం గురించి తెలియాలంటే బరాబర్ ప్రేమిస్తే సినిమా చూడాలన్నారు. తప్పును ఎత్తిచూపే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తున్నారని అన్నారు. తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించాలని కోరారు.
పెంపకంపై విమర్శలు: ప్రభాకర్ ఆవేదన!
బూతు పాట వివాదం: అసలేం జరిగింది?
ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


