|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటుడు రవిమోహన్‌కు అత్త నోటీసులు

Published: 29-05-2025, 11:19 PM
నటుడు రవిమోహన్‌కు అత్త నోటీసులు

నటుడు రవిమోహన్ (జయం రవి) మరియు ఆర్తి మధ్య విడాకుల వివాదం తీవ్రంగా మారింది. రవిమోహన్ తన భార్య మరియు అత్తపై చేసిన ఆరోపణలపై వారిద్దరూ న్యాయ నోటీసులు పంపారు. ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చనీయాంశమైంది.

Key Points

1

రవిమోహన్ తన భార్య ఆర్తి మరియు అత్త సుజాతలకు న్యాయ నోటీసులు పంపారు.

2

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఆరోపణలను తొలగించాలని ఆర్తి మరియు సుజాతలను కోరారు.

4

న్యాయస్థానం సామాజిక మాధ్యమాల్లో ఈ వివాదం గురించి ప్రసారాన్ని నిషేధించింది.

రవిమోహన్, ఆర్తి మధ్య వివాదం

నటుడు రవిమోహన్ (జయం రవి), భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం సీరియల్‌గా సాగుతోందనే చెప్పాలి. ముందు రవిమోహన్, ఆర్తీ ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. తమ జీవితంలో వివాదం తలెత్తడానికి కారణం గాయని కెనిషానే కారణం అని ఆర్తిపై విమర్శలు చేశారు. అయితే మీ వివాదంలోకి తనను లాగొద్దని కెనిషా గట్టిగానే హెచ్చరించారు. కాగా రవిమోహన్, ఆర్తి విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాగా తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని రవిమోహన్‌  ఆయన భార్య ఆర్తికి, అత్త సుజాతలకు నోటీసుల పంపారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్తి తల్లి సినీ,టీవీ సీరియళ్ల నిర్మాత సుజాత  తన న్యాయవాది ద్వారా రవిమోహన్‌కు ఒక నోటీస్‌ పంపారు. తమపై చేసిన తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇకపై సోషల్‌మీడియాలో తప్పుడు పోస్ట్‌లను షేర్‌ చేయవద్దన్నారు. అదే నోటీస్‌ను మీడియాకు రిలీజ్‌ చేశారు. అందులో రవిమోహన్, ఆర్తీల వ్యవహారం గురించి, వారి వివాహ సమస్యల గురించిన ప్రసారాన్ని అన్ని సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. అదేవిధంగా రవిమోహన్, ఆర్తి, ఆమె తల్లి సుజాతలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేయకూడదని పేర్కొన్నారన్నారు. వీరి వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.

న్యాయ నోటీసులు మరియు కోర్టు ఆదేశాలు

సామాజిక మాధ్యమాలపై ప్రభావం

రవిమోహన్ మరియు ఆర్తి మధ్య వివాదం కోర్టులో ఉన్నందున, వారి వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.