|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఘోర రోడ్డు ప్రమాదం.. నటుడు షైన్ టామ్ చాకోకి తీవ్ర గాయాలు, తండ్రి దుర్మరణం

Published: 06-06-2025, 1:19 AM
ఘోర రోడ్డు ప్రమాదం.. నటుడు షైన్ టామ్ చాకోకి తీవ్ర గాయాలు, తండ్రి దుర్మరణం

సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తండ్రి మృతి చెందారు. షైన్ టామ్ చాకోకు తీవ్ర గాయాలయ్యాయి.

Key Points

1

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి.

2

షైన్ టామ్ చాకో, అతని సోదరుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.

4

సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద వివరాలు

రోడ్డు ప్రమాదం (Road Accident)లో నటుడికి తీవ్ర గాయాలు కాగా.. తండ్రి దుర్మరణం పాలైన విషాద ఘటన సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko)తో పాటు అతడి సోదరుడు, తండ్రి కలిసి కారులో త్రిస్సూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకొట్టై సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చాకో తండ్రి సీపీ చాకో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చాకోతో పాటు సోదరుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

గాయపడిన వారు

పోలీసుల దర్యాప్తు

ఈ విషాద ఘటన మలయాళ చిత్ర పరిశ్రమను కలచివేసింది. షైన్ టామ్ చాకోకు త్వరిత కోలుకునేందుకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.