|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కీలక నిర్ణయం తీసుకున్న నటుడు శ్రీకాంత్.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్.. అయోమయంలో నెటిజన్లు

Published: 23-06-2025, 2:52 AM
కీలక నిర్ణయం తీసుకున్న నటుడు శ్రీకాంత్.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్.. అయోమయంలో నెటిజన్లు

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుండి 4 నెలల పాటు విరామం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

Key Points

1

శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియా నుండి 4 నెలల పాటు విరామం ప్రకటించారు.

2

వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

4

ఈ వార్త నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

శ్రీకాంత్ అయ్యంగార్ యొక్క సడెన్ నిర్ణయం

టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగార్(Srikanth Krishnaswamy Iyengar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు చిత్రాలు తెరకెక్కించిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. 2013లో వచ్చిన ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన చేసిన సినిమాలకంటే సోషల్ మీడియాలోనూ పలు కాంట్రవర్సీ కామెంట్లు చేసి దుమారం రేపాడు. కొన్నిసార్లు వివాదం కాస్త ముదిరిపోవడంతో క్షమాపణలు కూడా చెప్పిన రోజులున్నాయి. ఒక్కోసారి స్టేజ్ మీదనే రెచ్చిపోయి హద్దులు దాటి మాట్లాడటం, నోటికి హద్దు అదుపు లేనట్లు ప్రవర్తించడం వంటి చేశారు. ఎలాంటి భాష మాట్లాడుతున్నాడో కూడా మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడి చిక్కుల్లో పడేవారు.

అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా చెప్తుంటారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీకాంత్ అయ్యంగర్ సెన్సేషనల్ పోస్ట్ పెట్టాడు. తాజాగా, ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ‘‘నమస్తే అందరికీ ఓ శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మీ కోసం ఒక సూపర్, ఎక్స్టర్డినరీ, మైండ్ బ్లోయింగ్ న్యూస్‌‌తో మీ ముందుకు వచ్చాను. మరో నాలుగు నెలలు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించను. వ్యక్తిగత కారణాల వల్లే ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నాను. అందరికీ బాయ్’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు ఫుల్ యాక్టివ్‌గా ఉన్న శ్రీకాంత్‌కు సడెన్‌గా ఏమైంది.. వ్యక్తిగత కారణాలు అంటే అసలేం అయి ఉంటుంది అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

నెటిజన్ల ప్రతిచర్యలు

వ్యక్తిగత కారణాల రహస్యం

శ్రీకాంత్ అయ్యంగార్ యొక్క సోషల్ మీడియా విరామం నెటిజన్లలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది. వారి సందేహాలకు సమాధానం దొరకాలని వారు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.