|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Operation Sindoor: పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు అంటూ హీరోయిన్ సంచలన పోస్ట్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Published: 09-05-2025, 9:37 AM
Operation Sindoor: పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు అంటూ హీరోయిన్ సంచలన పోస్ట్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

తాజాగా, మలయాళ నటి అమీనా నిజాం ‘ఆపరేషన్ సిందూర్’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు అని ఆమె పేర్కొనడంతో సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది.

Key Points

1

మలయాళ నటి అమీనా నిజాం 'ఆపరేషన్ సిందూర్'పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

2

పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు అని ఆమె పేర్కొన్నారు.

4

సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

అమీనా నిజాం సంచలన పోస్ట్

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో అమాయకపు ప్రజలు 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ సమయంలోనే భారత్ ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. ఇక భారత్ దాడికి పాక్‌ చిత్తు చిత్తు అయిపోతుంది. ఇండియా ధాటికి తట్టుకోలేక అక్కడి ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. తమను కాపాడాలని కోరుతున్నారు. దీంతో భారతీయులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతూ.. యుద్ధం గురించి పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక ఆపరేషర్ సిందూర్ విజయవంతం కావడంతో హీరో, హీరోయిన్లు కూడా గురించి స్పందిస్తున్నారు. భారత్ సైన్యం శక్తి సామర్ధ్యాలు మరోసారి ప్రపంచానికి తెలిశాయంటూ పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, మలయాళ నటి అమీనా(Amina Nijam) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టింది. ‘‘అవును అనేక ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితుల్లో అధ్వానంగా ఉన్నప్పుడు మన దేశం చంపడాన్ని పరిష్కారంగా ఎంచుకుంది. పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించే వ్యక్తులు తారుమారు అయ్యారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల అక్కడి పౌరులకు మాత్రమే నష్టం వాటిల్లుతుంది. నేను అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదాన్ని కాకుండా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇక ఈ పోస్టును చూసిన వారంతా అమానాపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. అసలు పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయడమేంటని అంటున్నారు.

నెటిజన్ల విమర్శలు

సోషల్ మీడియాలో దుమారం

అమీనా నిజాం వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుందని అనిపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.