|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దివి వడ్త్యా సంచలనం! అమ్మాయిల అందంపై షాకింగ్ కామెంట్స్! వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ!!

Published: 12-02-2026, 5:05 AM
  • దివి వడ్త్యా షాకింగ్ కామెంట్స్: అమ్మాయిల బ్యూటీని ఎంజాయ్ చేయండి, కామెంట్స్ కాదు!
  • నవీన్ చంద్ర ‘హనీ’ సినిమాలో దివి మెరుపులు, కరుణ కుమార్ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్!
  • సోషల్ మీడియాలో దివి వడ్త్యా బోల్డ్ ఫోటోలు వైరల్, ఫాలోవర్స్ ఫిదా!
  • దివి వడ్త్యా కామెంట్స్‌పై నెటిజన్స్ రెస్పాన్స్, దుమారం రేపుతున్న కామెంట్స్!

బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన దివి వడ్త్యా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు దివి ఏమన్నదో చూద్దాం!

దివి వడ్త్యా సంచలన కామెంట్స్!

బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. అలా పాపులారిటీ సంపాదించుకుంది వారిలో దివి వడ్త్యా(Divi Vadthya) ఒకరు. అంతకముందు సినిమాల్లో చిన్న చిన్న రోల్ ప్లే చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది. మెయిన్‌గా సోషల్ మీడియాలో నెట్టింట బోల్డ్ డ్రెస్సులతో రచ్చ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడికి ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఈ భామ నవీన్ చంద్ర(Naveen Chandra) నటించిన ‘హనీ’((Honey) సినిమాలో ఈ చిన్నది కూడా నటించింది.

హనీ మూవీలో దివి మెరుపులు

‘పలాస’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్(Karuna Kumar), వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఇక ఇందులో దివ్య పిళ్లై, రాజా రవీంద్ర, మీరా వంటి వారు కీరోల్ ప్లే చేశారు. అయితే ఈ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి వడ్త్యా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మనం బయట వేరే కంట్రికి వెళ్లినప్పుడు, లేకపోతే వేరే ప్లేస్‌లో ఉన్నప్పుడు, బీచ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి అవుట్ ఫిట్ వేసుకుంటావో వేసుకో.

సోషల్ మీడియాలో దివి రచ్చ!

నువ్వు గుడికి వెళ్లినప్పుడు సంప్రదాయకంగా వెళ్లు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకు వచ్చా.. ఎలా రావోలో అలా వచ్చా.. అన్నీ కనిపించేలా విప్పుకొని రాలేగా. నేను చాలా మందిని చూశాను మన ఏజ్ వాళ్ళే అవ్వా నువ్వేంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నావు, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎవరు నిన్ను పెళ్ళి చేసుకుంటాడు, అని క్వశ్చన్ చేస్తారు. నిజంగా అది నాకు షాకింగ్‌గా అనిపిస్తుంది. గాయ్స్ మీరు చేంజ్ అవ్వండి అమ్మాయి బ్యూటీని చూసి ఎంజాయ్ చేయండి.. కానీ కామెంట్ చేయకండి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

దివి వడ్త్యా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె మాటలకు వస్తున్న స్పందన చూస్తుంటే, ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.