|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thamma Trailer: హారర్ యూనివర్స్‌లో రష్మిక.. ట్రైలర్ చూశారా?

Published: 26-09-2025, 9:46 AM
Thamma Trailer: హారర్ యూనివర్స్‌లో రష్మిక.. ట్రైలర్ చూశారా?

రష్మిక మందాన్న నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘థామా’ ట్రైలర్ విడుదలైంది. హారర్ యూనివర్స్‌లో వస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా వ్యాంపైర్‌గా కనిపించనున్నారు. దీపావళి కానుకగా అక్టోబరు 21న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ భయపెడుతూనే నవ్విస్తోంది.

Key Points

1

రష్మిక మందాన్న నటించిన బాలీవుడ్ చిత్రం 'థామా' ట్రైలర్ విడుదలైంది.

2

ఇది భేడియా, స్త్రీ వంటి విజయవంతమైన హారర్ యూనివర్స్ చిత్రాల తర్వాత వస్తోంది.

4

దీపావళి సందర్భంగా అక్టోబరు 21న ఈ హారర్-కామెడీ చిత్రం థియేటర్లలోకి రానుంది.

‘థామా’ విశేషాలు: దీపావళికి హారర్ ట్రీట్

హీరోయిన్ రష్మిక చేస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా ‘థామా’. భేడియా, స్త్రీ, స్త్రీ 2, ముంజ్య చిత్రాల తర్వాత హారర్ యూనివర్స్‌లో వస్తున్న మూవీ ఇది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ దీపావళి సందర్భంగా అక్టోబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ విశ్లేషణ: భయం, కామెడీ కలగలిసి

‘స్త్రీ’ చిత్రాల తర్వాత ‘థామా’ అంచనాలు

ట్రైలర్ చూస్తుంటే ఓవైపు భయపెడుతూనే మరోవైపు నవ్విస్తున్నారు. హీరో ఆయుష్మాన్.. వ్యాంపైర్ అవుతాడు. ఇతడి ప్రేమికురాలిగా రష్మిక నటించింది. మరి ప్రియుడిలో దెయ్యం లక్షణాలు వచ్చేసరికి రష్మిక ఏం చేసింది? చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్‌తో మూవీ తీసినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. గతంలో వచ్చిన స్తీ, స్త్రీ 2 చిత్రాలు వందల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. మరి ఇప్పుడు ‘థామా’ ఏం చేస్తుందో చూడాలి?

‘స్త్రీ’ వంటి విజయవంతమైన హారర్ చిత్రాల తర్వాత వస్తున్న ‘థామా’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ ఆకట్టుకుంది కాబట్టి, దీపావళికి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.