|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

50 సెకన్లకు 5 కోట్లు.. స్టార్ హీరోలకు కూడా షాకిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Published: 01-11-2025, 9:34 AM
50 సెకన్లకు 5 కోట్లు.. స్టార్ హీరోలకు కూడా షాకిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

లేడీ సూపర్ స్టార్ నయనతార తన పారితోషికంతో స్టార్ హీరోలకే షాక్ ఇస్తోంది. కేవలం 50 సెకన్ల వాణిజ్య ప్రకటనకు ఆమె రూ.5 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాహానంతరం కూడా ఆమె మార్కెట్ ఏమాత్రం తగ్గకుండా, పాన్ ఇండియా స్థాయిలో పలు చిత్రాలతో బిజీగా ఉంది.

Key Points

1

నయనతార 50 సెకన్ల టాటా స్కై యాడ్‌కు రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

2

దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార మొదటి స్థానంలో ఉన్నారు.

4

నిర్మాతగా 'రౌడీ పిక్చర్స్' ద్వారా చిత్రాలను నిర్మిస్తూ, పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది.

నయనతార రెమ్యునరేషన్: కోట్లలో పారితోషికం

కేరళ పుట్టి, తమిళ సినిమాల్లోకి వచ్చి.. సౌత్ లో స్టార్ గా ఎదిగింది నయనతార. తమిళ, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో నయనతార అగ్రస్థానంలో ఉన్నారు. ‘అయ్యా’ సినిమాతో అరంగేట్రం చేసి 20 ఏళ్లుగా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది సీనియర్ నటి. పాన్ ఇండియా స్థాయిలో  సత్తా చాటుతోంది.

నయనతార ఒక సినిమాకు 10 నుంచి 15 కోట్లు రెమ్యునరేషన్  తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. అంతే కాదు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా నయన్ కోట్లు సంపాదిస్తున్నారు. ఆమధ్య  50 సెకన్ల టాటా స్కై యాడ్‌లో నటించడానికి ఈస్టార్ హీరోయిన్  రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

వివాహం తర్వాత కూడా తగ్గని మార్కెట్

40 ఏళ్ల వయసు దాటినా, పెళ్లై పిల్లలు ఉన్నా.. నయనతార మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. వాటన్నింటినీ బ్రేక్ చేసి, ఇప్పటికీ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అంతే కాదు నిర్మాతగా కూడా రాణిస్తుంది నయనతార. రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా కొన్ని చిత్రాలను కూడా నిర్మిస్తుంది.

నిర్మాతగా, పాన్ ఇండియా స్టార్‌గా నయనతార

ప్రస్తుతం నయనతార  చేతిలో పలు తమిళ, మలయాళ చిత్రాలు ఉన్నాయి. తెలుగులో చిరంజీవి సరసన మన శంకరవరప్రసాదు గారు సినిమాతో నటిస్తోంది నయన్. ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక తెలుగులో బాలకృష్ణ జోడీగా నాలుగో సారి జతకట్టబోతోంది నయన్. ఇక  కన్నడలో యశ్‌తో కలిసి ‘టాక్సిక్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో యశ్‌కు అక్కగా లేడీ సూపర్ స్టార్  నటిస్తున్నారు.

నయనతార తన పారితోషికం, మార్కెట్ విలువతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వయస్సు, వివాహం అడ్డుకాదని నిరూపిస్తూ, నటిగా, నిర్మాతగా రాణిస్తూ, సౌత్ ఇండియన్ సినిమాలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.