
📌 Key Points
- నటి హేమ మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని, రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్ష.
- దాసరి నారాయణరావు సమాధి వద్ద తన మనసులోని కోరికలను వెల్లడించిన హేమ.
- గతంలో జై సమైక్యాంధ్ర, వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉన్న హేమ.
- సినిమా అవకాశాలు లేకపోవడంతో కొత్త ఇన్నింగ్స్ కోసం ప్రయత్నాలు ముమ్మరం.
టాలీవుడ్ నటి హేమ కెరీర్‌లో కీలక మలుపు! ఒకప్పుడు బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు సినిమా అవకాశాల కోసం, రాజకీయ ప్రవేశం కోసం సంచలన వ్యాఖ్యలు చేసింది. దాసరి నారాయణరావు సమాధి వద్ద ఆమె చేసిన ప్రకటన ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
హేమ సంచలన నిర్ణయం: సినిమాలతో పాటు రాజకీయాల్లోకి!
నటి హేమ ఒకప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. మంచి కామెడీ పాత్రలతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి మెప్పించింది. ఆద్యంతం అలరించింది. కానీ ఈ మధ్య కాలంలో ఆమెకి సినిమా ఆఫర్లు లేవు. ఆమె చేయడం లేదా? ఆమెకి రావడం లేదా? ఏం జరుగుతుందో ఏమోగానీ.. హేమ ఇటీవల కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. దాసరి నారాయణరావు సమాధి వద్ద తన మనసులో కోరికలను బయటపెట్టింది.
దాసరి నారాయణ రావు వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సమాధిని సందర్శించింది నటి హేమ. దాసరి సమాధిని ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం క్లీన్ కూడా చేయడం లేదని మంచు మనోజ్ వాపోయాడు. ఆయన స్వయంగా వెళ్లి తన మనుషులతో క్లీన్ చేయించాడు. నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా నటి హేమ్ కూడా అక్కడికి వెళ్లి దాసరి ఆశీస్సులు తీసుకుంది.
దాసరి సమాధి వద్ద గురు ఆశీస్సులు, కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ, ఈ రోజు గురువుగారి వర్థంతి అనేది కనీసం మైండ్‌లో కూడా లేదు. ఓ వీడియో చూసినప్పుడు అయ్యో ఆయన సమాధి ఇలా ఉందా అనిపించింది. అందుకే కొందరు మనుషులను తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే, అంతా నీట్‌గా బాగా చేసి ఉంది. గురువుగారే మాకు తన వర్థంతిని గుర్తు చేసి తమతో ఇలా చేయించుకున్నారనిపిస్తుంది. గురువుగారు ఉండి ఉంటే నా లైఫ్ మరోలా ఉండేది. చనిపోయాక కూడా మాకు గుర్తు చేసి ఇక్కడికి వచ్చేలా చేశారు. గురువుగారు నేను సినిమాల్లో బిజీ కావాలని, మంచి రాజకీయ నాయకురాలిని కావాలని ఆశీర్వదించండి ` అని తెలిపింది హేమ.
మొత్తంగా తన మనసులో మాటని బయటపెట్టింది హేమ. సినిమా అవకాశాలు లేకపోవడంతో మళ్లీ అవకాశాలు రావాలని తెలిపింది. అదే సమయంలో రాజకీయాల్లో రాణించాలని కోరుకుంది. తనకు రాజకీయాల్లోకి రావాలనే కోరకని ఆమె వెల్లడించింది. మున్ముందు ఆమె రాజకీయాల్లోకి రాబోతుందనే హింట్ ఇచ్చింది హేమ. మరి ఏ పార్టీ వాళ్లు ఆమెకి గాలం వేస్తారో చూడాలి. అయితే గతంలో 2014లోనే రాజకీయాల్లోకి వచ్చింది హేమ. జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ కూడా చేసింది. ఓడిపోయింది.
గతంలో హేమ రాజకీయ ప్రస్థానం, ఇప్పుడు ఏ పార్టీ?
ఆ తర్వాత 2019లో టైమ్‌లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపింది. జగన్మోహన్‌రెడ్డికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీలో చేరింది. కొంత కాలం యాక్టివ్‌గా ఉన్న ఆమె ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంది. ఆ మధ్య రీసార్ట్ రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్టు వినిపించింది. దీంతోపాటు పలు వివాదాల్లో ఆమె పేరు వినిపించింది. దీంతో హేమ సినిమాలకు గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం తన ప్రయత్నం షురూ చేసింది.
నటి హేమ కొత్త ప్రస్థానం ఎలా ఉండబోతుందో చూడాలి. ఆమె రాజకీయాల్లో రాణిస్తుందా, మళ్లీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. మరిన్ని ఆసక్తికర అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


