|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా జీవితంలో ఎందరో పురుషులు! పెళ్లి గురించి సంచలన విషయాలు చెప్పిన జయమాలిని!

Published: 28-03-2026, 10:05 AM
నా జీవితంలో ఎందరో పురుషులు! పెళ్లి గురించి సంచలన విషయాలు చెప్పిన జయమాలిని!
  • ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన జయమాలిని జీవితంలోని ఆసక్తికర విషయాలు.
  • పెళ్లి అయిన, కాని ఎందరో తనపై మనసు పడ్డారని జయమాలిని వెల్లడి.
  • కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ ప్రేమను త్యాగం చేసినట్టు తెలిపిన జయమాలిని.
  • మలయాళ సూపర్ స్టార్ జయన్ తనను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారని వెల్లడి.

ప్రముఖ నటి జయమాలిని తన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమెను ఎంతోమంది ప్రేమించారని, కానీ కుటుంబం కోసం తన ప్రేమను త్యాగం చేశానని చెప్పారు. మలయాళ నటుడు జయన్ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారని తెలిపారు.

నాపై ఎందరి మనసు పడింది: జయమాలిని

Jayamalini: జయమాలిని.. ఈ పేరు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ, ఒకప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన, ఓ ఊపు ఊపిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జయమాలిని (Jayamalini). 1970, 80వ దశకాల్లో ఆమె తన డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ భాషల్లో కలిపి దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించిన జయమాలిని కేవలం డ్యాన్సర్‌గానే కాకుండా, కొన్ని సినిమాల్లో వ్యాంప్ పాత్రల్లో, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా మెప్పించారు. ‘జగన్మోహిని’ (Jaganmohini) వంటి సినిమాల్లో ఆమె నటన సోలో హీరోయిన్‌గా ఆమెకున్న క్రేజ్‌ను నిరూపించింది. చాలా గ్యాప్ తర్వాత ఓ ఇంటర్వ్యూ (Jayamalini Interview)లో పాల్గొన్న ఆమె, తన లైఫ్‌లోని కొన్ని షాకింగ్ విషయాలను తెలిపారు.

ప్రేమను త్యాగం చేయడానికి కారణం ఇదే

‘‘ఆ రోజుల్లో నేనంటే చాలా మంది మనసు పడ్డారు. పెళ్లి అయినవారు, పెళ్లి కానివారు.. ఇలా చాలా మంది నేనంటే మనసు పడ్డారు. నాకు కూడా అప్పట్లో కొందరు బాగా నచ్చేవారు. కానీ, నేనొక డైరెక్షన్‌లో ఉండేదానిని. నేను ఎంత ఇష్టపడినప్పటికీ, అది ఎవరికీ చెప్పలేదు. ఒక వైపు నాకు నచ్చిన వారు, నన్ను ఇష్టపడేవారు.. మరో వైపు నా ఫ్యామిలీ.. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అని చూసినప్పుడు.. నాకు ఫ్యామిలీ కంటే ఏదీ ఎక్కువకాదని అనిపించింది. అందుకే ఫ్యామిలీకి చెడ్డపేరు తీసుకురాకూడదని నా ఇష్టాన్ని కూడా అణిచిపెట్టుకున్నాను. ఎందుకంటే, ఇంట్లో పెళ్లి కావాల్సిన సిస్టర్స్, బ్రదర్స్ ఉన్నారు. నా కారణంగా వారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని.. ఒక లిమిట్ పెట్టుకుని, అందులోనే నడిచాను. 17, 18 సంవత్సరాల వయసులో ఎవరికైనా ఇష్టం అనేది పుడుతుంది. హర్మోన్స్ ప్రాబ్లమ్ అది.

మలయాళ సూపర్ స్టార్ జయన్ పెళ్లి ప్రయత్నాలు

నాకు కాస్త మెచ్యురిటీ వచ్చిన తర్వాత ఒకరిని బాగా ఇష్టపడ్డాను.. కానీ, అతనికి చెప్పలేదు. చనిపోయే లోపు ఆ వ్యక్తికి నేను నిన్ను ఇష్టపడ్డానని చెబుతాను.. అప్పుడు కానీ, నాకు తృప్తిగా ఉండదు. అప్పట్లో జయన్ అనే మలయాళ సూపర్ స్టార్ నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా ట్రై చేశారు. నాకంటే 22 సంవత్సరాలు పెద్దాయన. నా ఫ్యామిలీతో కూడా మాట్లాడారు. ఒక మంచి ఇల్లు, ఆస్తులు అన్నీ కూడబెట్టి.. జయను పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లోనే ఉంటామని.. మా వాళ్లందరికీ చెప్పారు. నాకు మాత్రం అతనిపై ఎలాంటి ఇష్టం లేదు. కేవలం ఒకే ఒక్కరిని నాకు వయసు వచ్చినప్పుడు ఇష్టపడ్డాను. అతను ఎవరనేది చెప్పను. ఎందుకంటే, ఇటు నాకు ఫ్యామిలీ ఉంది, అటు అతనికి ఫ్యామిలీ ఉంది. కేవలం అప్పటి నా ఇష్టాన్ని మాత్రం చనిపోయే లోపు తెలియజేయాలనే కోరిక మాత్రం నాలో ఉంది’’ అని జయమాలిని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె అంతగా ఇష్టపడిన హీరో ఎవరా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వారికి ఆమె చిన్న హింట్ కూడా ఇచ్చారు. కన్నడ, మలయాళ, తెలుగు, తమిళ.. ఈ భాషలలో ఏ భాషకి చెందిన హీరోనో మీరే కనిపెట్టండి అని ఆమె సవాల్ విసిరారు.

జయమాలిని తన జీవితంలోని ప్రేమ, కుటుంబం గురించిన విషయాలను పంచుకున్నారు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారు. తన ప్రేమను బయటపెట్టాలని అనుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.