
ప్రముఖ సినీనటి కల్పికకు షాకింగ్ న్యూస్. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో జరిగిన ఘటనలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్లు చెల్లించకుండా, సిబ్బందిపై దాడి చేసిందని ఆరోపణలు.
Key Points
ప్రిజం పబ్‌లో తినిన ఆహారానికి బిల్లు చెల్లించకుండా తప్పించుకున్నారు.
పబ్ సిబ్బందిపై దాడి చేసి, విలువైన వస్తువులను ధ్వంసం చేశారు.
పబ్ సిబ్బందిని బాడీ షేమింగ్ చేసి, అనుచితమైన భాష ఉపయోగించారు.
పోలీసుల ఎదుటే హంగామా చేసి, కేసు నమోదు అయింది.
ప్రిజం పబ్‌లో ఘటన
సినీనటి కల్పిక (Actress Kalpika)కు దిమ్మతిరిగి షాక్ తగిలింది. తాజాగా, ఆమెపై గచ్చిబౌలి (Gachibowli) పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, మే 29న ప్రిజం పబ్ (Prism Pub)లో తిన్న ఫుడ్‌కు బిల్ కట్టుకుండా తిరిగి సిబ్బందిపై దాడి చేయడంతో పాటు అక్కడున్న విలువైన సామగ్రిని కల్పిక ధ్వంసం చేసింది. అదేవిధంగా పబ్ సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, నోటికొచ్చినట్లుగా బూతులు తిడుతూ.. ఏకంగా పోలీసుల ఎదుటే హంగామా చేసింది. ఈ ఘటనపై ప్రిజం పబ్ యాజమాన్యం, నటి కల్పికపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వక ఫిర్యాదును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో అందజేశారు. దీంతో కల్పికపై 324(4),352,351(2) బీఎన్ఎస్ యాక్ట్ (BNS Act) ప్రకారం పోలీసులు నటి కల్పికపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఆమెను త్వరలోనే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరపచనున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
పోలీసుల ఫిర్యాదు
కేసు నమోదు
ఈ ఘటనతో సినీనటి కల్పికకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలీసులు త్వరలోనే ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తారు.


