|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోనాలిసా సంచలన ఆరోపణలు: డైరెక్టర్‌పై 10 సార్లు లైంగిక దాడి, పోక్సో కేసు!

Published: 02-05-2026, 10:46 AM
మోనాలిసా సంచలన ఆరోపణలు: డైరెక్టర్‌పై 10 సార్లు లైంగిక దాడి, పోక్సో కేసు!
  • కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో మోనాలిసా వైరల్ అయ్యింది.
  • డైరెక్టర్ సనోజ్ మిశ్రా తనను 10 సార్లు లైంగికంగా వేధించాడని మోనాలిసా ఆరోపించింది.
  • సనోజ్ మిశ్రాపై ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది.
  • మోనాలిసా మైనర్‌గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నందుకు ఆమె భర్తపై పోక్సో కేసు నమోదైంది.

కుంభమేళాలో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన మోనాలిసా భోంస్లే, ఇప్పుడు సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా తనపై 10 సార్లు లైంగిక దాడి చేశాడని ఆమె పోక్సో కేసు పెట్టింది.

మోనాలిసా: కుంభమేళా నుండి సినిమా వరకు

Monalisa Controversy : కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తనదైన అందంతో సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారింది మోనాలిసా భోంస్లే. ఇక డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెతో ఏకంగా సినిమా తీస్తానని అనౌన్స్ చేశాడు కూడా. మరి ఏ ముహూర్తాన వైరల్ అయ్యిందో కాని అప్పటి నుండి కంటెంట్ తక్కువ, కాంట్రవర్సీలు ఎక్కువ అన్నట్టుగా తయారైంది ఈవిడ పరిస్థితి. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుందనుకున్న మోనాలిసా, ఇప్పుడు వరుస కాంట్రవర్సీలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు లీగల్ ఇష్యూస్‌తో ఫైట్ చేస్తూ మీడియాలో హైలెట్ అవుతుంది.

సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ వైరల్ అయిన మోనాలిసా సొంత ఊరు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్. కుంభమేళాకు వచ్చిన లక్షలాది భక్తుల కళ్లలో ఈ పిల్లికళ్ల అమ్మాయి పడటంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఇక ఈమె క్రేజ్ ఏ రేంజ్‌కి చేరిందంటే ఆమె ఉన్న చోట ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. ఆ క్రేజ్ చూసే ఆమె ఇంటికి వెళ్లి మరీ, తన సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ కోసం హీరోయిన్‌గా ఎంపిక చేశారు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా. కట్ చేస్తే… ఆగస్టు 2025లో సనోజ్ – మోనాలిసా కాంబోలో సినిమా షూటింగ్ మొదలైంది. ఇక సినిమా సాఫీగా సాగుతుంది అనుకున్న టైమ్‌లో సనోజ్ తనని సెక్సువల్‌గా హరాస్ చేశాడు అంటూ సంచలన కామెంట్స్ చేసి మీడియాలో హైలెట్ అయ్యింది.

డైరెక్టర్‌పై లైంగిక దాడి ఆరోపణలు

కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా

ఇదిలా ఉంటే మోనాలిసా లైఫ్‌లో మరో షాకింగ్ ఇన్సిడెంట్ ఆమె మ్యారేజ్. మార్చి 11, 2026న కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో పెళ్లి సమయానికి ఆమెకి 16 ఏళ్ల 2 నెలలు మాత్రమేనని తేలడంతో మైనర్‌ని పెళ్లాడాడు అన్న కారణంతో ఫర్మాన్‌పై పోక్సో కేసు నమోదై జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే తాను గర్భవతినని సోషల్ మీడియాలో మోనాలిసా అనౌన్స్ చేయడం ఇక్కడ గమనార్హం.

తనపై 10 సార్లు లైంగిక వేధింపులు

మోనాలిసా వివాదాస్పద జీవితం

ఇక తాజాగా తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా షూటింగ్ సమయంలో తనపై 10 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఎర్నాకులం పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేస్ పెట్టింది . సినిమా అవకాశాల పేరుతో తనను వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సనోజ్ మిశ్రాతో పాటు తన ఇమేజ్ డ్యామేజ్ చేయడంలో ఒక లాయర్ హస్తం కూడా ఉందంటూ తెలిపింది. ఈ క్రమంలోనే దర్శకుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

చూడాలి మరి… మారుమూల గ్రామంలో పుట్టి రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారి ప్రస్తుతం చిక్కుల్లో పడ్డ మోనాలిసా ఈ వివాదాల నుండి ఎప్పుడు బయటపడుతుందో!

మోనాలిసా జీవితం వివాదాలకు నెలవుగా మారింది. ఒకవైపు కెరీర్, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సవాళ్లు ఆమెను నిరంతరం వార్తల్లో నిలుపుతున్నాయి. ఈ పోక్సో కేసు తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.