
📌 Key Points
- మీనాక్షి చౌదరి నటించిన ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న విడుదల కానుంది.
- మీనాక్షి గతంలో ‘మీనమ్మ’గా ప్రేక్షకులను అలరించింది, ఇప్పుడు ‘చారులత’గా రానుంది.
- వెంకటేష్ యోగాలో ఉంటారని, రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టమని మీనాక్షి అన్నారు.
- మహేష్ బాబు అందంగా ఉంటారని మీనాక్షి పొగడ్తలు కురిపించారు.
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలువురు హీరోల గురించి మాట్లాడారు. ఆమె మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు
AOR Pre Release Event: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.. ఇక ప్రస్తుతం ఈమె వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ లో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీనాక్షి చౌదరి సినిమా గురించి మాట్లాడుతూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసారు. గత ఏడాది మీనమ్మగా నన్ను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది చారులతో పాత్ర కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ జనవరి 14వ తేదీ థియేటర్ కి వచ్చి ఈ సినిమాని చూడాలని మీనాక్షి చౌదరి తెలియచేశారు.
హీరోల గురించి మీనాక్షి చౌదరి కామెంట్స్
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఇదివరకు నటించిన హీరోల గురించి ఒక మాటలో చెప్పమంటూ ప్రశ్నలు వేశారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ గారి గురించి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఆయన ఎప్పుడు యోగాలోనే ఉంటారని చాలా సైలెంట్ గా, పీస్ ఆఫ్ మైండ్ తో తన పని తాను తీసుకెళ్తారని తెలియజేశారు. ఇక రవితేజ గురించి మాట్లాడుతూ.. వామ్మో రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టమని తెలిపారు. రవితేజ గారు సూపర్ ఎనర్జీ అంటూ తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో కిలాడి సినిమా విడుదలైంది.
ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతూనే మహేష్ బాబు చాలా అందంగా ఉంటారని, సో హ్యాండ్సమ్ అంటూ మహేష్ బాబు అందంపై పొగడ్తలు కురిపించడమే కాకుండా అద్భుతమైన నటుడు అంటూ మహేష్ బాబు గురించి తెలిపారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి మాట్లాడుతూ ఆయన పర్ఫెక్ట్ టైమింగ్ కు హాట్సాఫ్.. ఈ టైం కి రావాలి అంటే అంతకుముందే అక్కడ ఉంటారని తెలిపారు. దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ.. వండర్ ఫుల్ జెంటిల్మెన్ అని చెప్పారు. ఇలా నవీన్ పోలిశెట్టి గురించి కూడా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. మా రాజుగారు మంచి ఎంటర్టైనర్ అంటూ ఈమె పని చేసిన హీరోల గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబుపై మీనాక్షి ప్రశంసలు
మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె రాబోయే చిత్రం ‘అనగనగా ఒక రాజు’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


