|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రంప్ ఫైర్: ఈ రాత్రే ఇరాన్పై భీకర దాడులు.. ప్రపంచం ఉలిక్కిపడింది!

Published: 08-07-2026, 11:54 AM
ట్రంప్ ఫైర్: ఈ రాత్రే ఇరాన్పై భీకర దాడులు.. ప్రపంచం ఉలిక్కిపడింది!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ఈ రాత్రే భీకర దాడులు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. నాటో సదస్సు వేదికగా ఇరాన్కు తుది హెచ్చరికలు జారీ చేస్తూ, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Key Points

1

ఈ రాత్రికి ఇరాన్పై భీకర దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.

2

నాటో సదస్సు వేదికగా ఇరాన్కు తుది హెచ్చరికలు జారీ చేశారు.

4

ఇరాన్ అణురహిత దేశంగా మారడమే తమ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ సంచలన ప్రకటన: ఈ రాత్రే ఇరాన్పై దాడులు

ఈ రాత్రికి ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు వేదికగా.. ఇరాన్ దేశానికి తుది హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు తెగబడటంతో.. ఇరుదేశాల మధ్యన కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ అవాగనహ ఒప్పందం పూర్తిగా ముగిసిపోయిందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే.. ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని ప్రకటించడం.. యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. మంగళవారం రాత్రే తాము ఇరాన్ శక్తులను దెబ్బతీశామని, ఈ రాత్రికి జరగబోయే దాడులు అంతకంటే పెద్దఎత్తున ఉంటాయని, అవసరమైతే ఇరాన్ కు చెందిన ప్రసిద్ధ ఖార్గ్ ద్వీపాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు.

అంతర్జాతీయ సముద్రమార్గాల్లో ప్రయాణించే వ్యాపార నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తూ.. ఇరాన్ తీవ్ర అరాచకానికి పాల్పడుతోందని ట్రంప్ మండిపడ్డారు. ఆ దేశం గత 47 ఏళ్లుగా అబద్ధాలు చెప్తూ.. మోసాలకు పాల్పడుతూ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రౌడీలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. తమ సైనికుల్ని పొట్టనపెట్టుకున్న ఇరాన్ తో తేల్చుకోవాల్సిన పాతలెక్కలు చాలానే ఉన్నాయన్నారు. ఇరాన్ అణురహిత దేశంగా మారడమే తమ ఏకైక లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. శాంతి చర్చల సమయంలో అన్ని విషయాలకు అంగీకరించి.. బయటకు వచ్చాక మీడియా ముందు అటువంటి చర్చలే జరగలేదని ఆ దేశ పాలకులు చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. తాము విధించిన సముద్ర దిగ్బంధం కేవలం ఇరాన్ దేశానికి మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన దేశాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు.

నాటో సదస్సులో కీలక హెచ్చరికలు

ఇరాన్ అణురహిత దేశంగా మారాలనే లక్ష్యం

ట్రంప్ హెచ్చరికలతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఇరాన్ అణురహిత దేశంగా మారడమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన ట్రంప్, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.