
📌 Key Points
- ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన చేసినా అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
- ఇరాన్‌లోకి 10,000 మంది సైన్యాన్ని పంపేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి.
- అమెరికా సైనికులు ఇరాన్ గడ్డపై అడుగుపెడితే శవపేటికల్లోకే చేరుకుంటారని ఇరాన్ హెచ్చరించింది.
- తొలి విడతలో 3500 మంది అమెరికా సైనికులు మిడిల్ ఈస్ట్ లో అడుగుపెట్టినట్లు సమాచారం.
ట్రంప్ తాత్కాలికంగా యుద్ధ విరమణ ప్రకటించినప్పటికీ, అమెరికా మరియు ఇరాన్ మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇరాన్ అమెరికాను హెచ్చరిస్తూ సంచలన ప్రకటనలు చేస్తోంది. అమెరికా సైన్యం ఇరాన్ లో అడుగు పెడితే నరకానికి స్వాగతం పలుకుతామని తేల్చి చెప్పింది.
అమెరికాకు ఇరాన్ మీడియా హెచ్చరిక
యుద్ధానికి ట్రంప్ తాత్కాలిక విరమణ ఇచ్చినప్పటికీ.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమకు భయపడి ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటించాడని ఇరాన్ ర్యాగింగ్ చేస్తోంది. అయితే ఈ గ్యాప్ లోనే ఇరాన్ లోకి పది వేల మంది సైన్యాన్ని అమెరికా పంపబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.
తమ దేశంలోకి 10,000 మంది సైన్యాన్ని పంపుతోన్న అమెరికాకు ఇరాన్ మీడియా హెచ్చరికలు జారీ చేసింది. నరకానికి స్వాగతం అంటూ టెహ్రాన్ టైమ్స్ తన మొదటి పేజీలో హెడ్ లైన్ పెట్టి అమెరికాకు షాక్ ఇచ్చింది. ఇరాన్ గడ్డపైన అడుగుపెట్టే, ఏ అమెరికా సైనికుడైనా శవపేటికలోకే చేరుకుంటాడని డేంజర్ బెల్స్ పంపింది మీడియా సంస్థ. అయితే ఈ న్యూస్ బయటకు వచ్చిన కొద్దిసేపటికి తొలి విడతలో అమెరికాకు చెందిన 3500 మందితో కూడిన సైన్యం మిడిల్ ఈస్ట్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నిజంగానే ఇది జరిగితే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అంటున్నారు.
యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా?
మధ్యప్రాచ్యంలోకి అమెరికా సైన్యం
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ హెచ్చరికలను అమెరికా ఏ విధంగా పరిగణిస్తుందో చూడాలి. ఒకవేళ నిజంగానే సైనిక చర్య జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు.



Jay Bhanushali Calls Ex-Wife Mahhi Vij and Daughter Tara’s Dance ‘So Cute’ on Bole Chudiyan