|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టెలిగ్రామ్ సవాల్: నిషేధంపై ఢిల్లీ హైకోర్టులో నేడు కీలక విచారణ!

Published: 17-06-2026, 4:31 AM
టెలిగ్రామ్ సవాల్: నిషేధంపై ఢిల్లీ హైకోర్టులో నేడు కీలక విచారణ!
  • నీట్-యుజి రీ-ఎగ్జామ్ పారదర్శకత కోసం టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది.
  • కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టెలిగ్రామ్ యాప్.
  • నిషేధం వల్ల లక్షలాది మంది చట్టబద్ధమైన వినియోగదారులపై అన్యాయంగా ప్రభావం పడుతుందని వాదన.
  • టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు, లీకేజీలు ఆగవని వ్యాఖ్యానించారు.

నీట్-యుజి రీ-ఎగ్జామ్ లీకేజీల నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మరికాసేపట్లో అత్యవసర విచారణ జరగనుంది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

టెలిగ్రామ్ బ్యాన్‌కు కారణం ఏంటి?

దేశవ్యాప్తంగా జూన్ 21న జరగబోయే నీట్-యుజి (NEET UG 2026) రీ ఎగ్జామ్స్ పారదర్శకతను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో టెలిగ్రామ్ (Telegram) యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ చర్య వల్ల లక్షలాది మంది చట్టబద్ధమైన వినియోగదారులపై అన్యాయంగా ప్రభావం పడుతోందని వాదిస్తూ ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. దీంతో అత్యవసర విచారణకు హైకోర్డు అంగీకరించింది. మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మరో వైపు టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ (Pavel Durov) నిషేధంపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన అసలు సూత్రధారులను వదిలేసి, కొందరు వినియోగదారులు లీక్డ్ మెటీరియల్‌ను షేర్ చేశారనే నెపంతో ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌ను వారం రోజుల పాటు నిషేధించిందని అన్నారు. ఈ నిషేధం వల్ల లీకేజీలు ఏమీ ఆగవని, ఆ లీక్‌లు కాస్తా ఇప్పుడు ఇతర యాప్‌లలోకి మారిపోతాయని పావెల్ దురోవ్ కామెంట్ చేశారు.

ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ పిటిషన్

పావెల్ దురోవ్ తీవ్ర వ్యాఖ్యలు

టెలిగ్రామ్ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు విచారణ కీలకం కానుంది. ప్రభుత్వ నిర్ణయంపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చే తీర్పు దేశంలో డిజిటల్ స్వేచ్ఛపై ప్రభావం చూపవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.