|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

AP RGUKT IIIT Counselling 2026 : ఏపీ ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ అప్డేట్ – మీ కాల్ లెటర్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Published: 18-06-2026, 3:43 PM
AP RGUKT IIIT Counselling 2026 : ఏపీ ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ అప్డేట్ - మీ కాల్ లెటర్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP RGUKT IIIT Counselling 2026 : ఏపీలోని ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్‌లలో ఆరేళ్ల కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో సీట్ల భర్తీకి సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, కౌన్సెలింగ్‌కు ఎంపికైన అర్హులైన విద్యార్థులందరికీ సంబంధించిన అధికారిక కాల్ లెటర్లను (Call Letters) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ప్రాథమికంగా ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇప్పటికే అందుబాటులో ఉంచారు. అయితే వీరు అధికారిక వెబ్ సైట్ నుంచి సులభంగా కాల్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట విద్యార్హత ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, కాల్ లెటర్‌తో పాటు అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను, వాటి జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసి సీట్లను కేటాయిస్తారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.