|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శంకర్ వారసుడి ఎంట్రీ: కృతి శెట్టితో రొమాన్స్.. ‘లవర్ బాయ్’గా అర్జిత్ సంచలనం!

Published: 18-06-2026, 3:43 PM
శంకర్ వారసుడి ఎంట్రీ: కృతి శెట్టితో రొమాన్స్.. ‘లవర్ బాయ్’గా అర్జిత్ సంచలనం!
  • దర్శకుడు శంకర్ చిన్న కుమారుడు అర్జిత్ ‘లవర్ బాయ్’ సినిమాతో హీరోగా పరిచయం.
  • ఈ చిత్రంలో అర్జిత్ సరసన టాలీవుడ్ నటి కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
  • చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ జూలైలో మొదలు.
  • శంకర్ కుమార్తె అదితి ఇప్పటికే నటిగా గుర్తింపు పొందగా, ఇప్పుడు అర్జిత్ వంతు.

ప్రముఖ దర్శకుడు శంకర్ చిన్న కుమారుడు అర్జిత్ ‘లవర్ బాయ్’ సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. శంకర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ అర్జిత్ వెండితెరపై మెరవడానికి సిద్ధమయ్యాడు.

శంకర్ కుమారుడు అర్జిత్ సినీ రంగ ప్రవేశం

Arjith Debut: శంకర్ …ఒకప్పుడు ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పేరిది..’జెంటిల్మన్’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘రోబో’ లాంటి క్లాసిక్స్‌తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ క్రియేటివ్ డైరెక్టర్, గత కొన్నేళ్లుగా సక్సెస్ ట్రాక్ తప్పి తెగ ఇబ్బంది పడుతున్నాడు.ముఖ్యంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో తీసిన ‘గేమ్ ఛేంజర్’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి . దీంతో మెగా ఫ్యాన్స్ ను సైతం భయపెట్టిన శంకర్, ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యారు.

అయితే, తండ్రి శంకర్ కెరీర్ ఒడిదొడుకుల్లో ఉన్నా.. ఆయన వారసుడు మాత్రం వెండితెరపై హీరోగా మెరవడానికి పక్కా ప్లాన్‌తో రెడీ అయిపోయాడు.అవును శంకర్ కుమారుడు అర్జిత్ హీరోగా అఫీషియల్ ఎంట్రీ ఖరారైపోయింది.

శంకర్ చిన్న కుమారుడైన అర్జిత్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ‘లవర్ బాయ్’ అనే క్యాచీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.ఈ సినిమాలో అర్జిత్ సరసన టాలీవుడ్ క్యూట్ బ్యూటీ, ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. చెన్నైలో గురువారం (జూన్ 18) ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. తమిళంతో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కృతి శెట్టితో రొమాన్స్.. ‘లవర్ బాయ్’ విశేషాలు

ఈ సినిమాను అశోక్ కుమార్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions)మరియు ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఇక జూలై మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది (2027) సంక్రాంతికి రానుందట.

డైరెక్టర్ శంకర్‌కు ముగ్గురు పిల్లలు అన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఇప్పటికే వివాహం జరిగి సెటిల్ అవ్వగా.. మిగిలిన ఇద్దరు పిల్లలు సినిమా ఇండస్ట్రీనే కెరీర్‌గా ఎంచుకున్నారు.శంకర్ రెండో కుమార్తె అదితి ఇప్పటికే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కార్తీ సరసన ‘విరుమాన్’, శివకార్తికేయన్‌తో ‘మావీరన్’ సినిమాలు చేసింది. రీసెంట్‌గా బెల్లం కొండ ‘భైరవం’మూవీతో టాలీవుడ్‌లోకి కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు తండ్రి, అక్కల బాటలోనే అర్జిత్ ‘లవర్ బాయ్’ సినిమాతో లక్ చెక్ చేసుకోబోతున్నాడు.

శంకర్ కుటుంబం: సినీ వారసత్వం

కృతి శెట్టి గ్లామర్, కేవీఎన్ ప్రొడక్షన్స్ క్రేజ్ తోడవ్వడంతో ‘లవర్ బాయ్’ కోలీవుడ్ మరియు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి తండ్రికి పోయిన వైభవాన్ని కొడుకు తన సక్సెస్‌తో తిరిగి తెస్తాడో లేదో చూడాలి!

శంకర్ వారసుడిగా అర్జిత్ సినీ ప్రవేశంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘లవర్ బాయ్’ సినిమాతో అర్జిత్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా విజయం అతని కెరీర్‌కు కీలకం కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.