|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో చరిత్ర సృష్టిస్తున్న ఫ్యామిలీ థ్రిల్లర్! ప్రైమ్‌ను షేక్ చేస్తున్న టాప్ 10 సినిమాలు!

Published: 24-06-2026, 11:30 PM
ఓటీటీలో చరిత్ర సృష్టిస్తున్న ఫ్యామిలీ థ్రిల్లర్! ప్రైమ్‌ను షేక్ చేస్తున్న టాప్ 10 సినిమాలు!
  • మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ ఇండియా వైడ్ నంబర్ 1గా ప్రైమ్‌లో దూసుకుపోతోంది.
  • సూర్య ‘కరుప్పు’ & అనుపమ ‘మరీచిక’ ప్రైమ్ టాప్ 3లో సంచలనం సృష్టిస్తున్నాయి.
  • థియేటర్లలో ఆడకపోయినా, ఓటీటీలో ‘డెకాయిట్’ సత్తా చాటుతోంది.
  • తెలుగు వెర్షన్ ‘దృశ్యం 3’ కూడా టాప్ 10లో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న సరికొత్త ట్రెండ్ ఇదే! థియేటర్లలో ఏమాత్రం ఆదరణ పొందకపోయినా, కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నాయి. ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం టాప్ 10లో దూసుకుపోతున్న చిత్రాలు, వాటి వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో చూద్దాం. ఈ వార్త తెలుగు సినీ అభిమానులకు పండగే!

ప్రైమ్‌లో నంబర్ 1: ‘దృశ్యం 3’ మ్యాజిక్!

ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఇందులో చూస్తున్నారు ఆడియెన్స్. థియేటర్ కి వెళ్లేవారి శాతం తగ్గింది. ఓటీటీలో చూసేవారి శాతం పెరిగింది. ఈ క్రమంలో థియేటర్లో రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా సినిమాలు ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి. అందులో భాగంగా ప్రైమ్‌ వీడియోస్‌లో ఫ్యామిలీ థ్రిల్లర్‌ మూవీ టాప్‌లో ఉంది. వీటితోపాటు యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రైమ్‌లో ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 మూవీస్‌ ఏంటో చూద్దాం.

ప్రైమ్‌లో నెంబర్‌ 1లో దూసుకుపోతున్న మూవీ `దృశ్యం 3`. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన చిత్రమిది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. మీనా హీరోయిన్‌గా నటించింది. ఒక మర్డర్‌ కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇదే కేసుతో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో సీక్వెల్‌ కూడా మలయాళంలో పెద్ద హిట్‌ అయ్యింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంది. ప్రైమ్‌లో మొదటి స్థానంలో దూసుకుపోతుంది.

థియేటర్లలో ఫెయిల్, ఓటీటీలో బ్లాక్‌బస్టర్!

రెండో స్థానంలో తమిళ మూవీ `కరుప్పు` ఉంది. సూర్య హీరోగా, త్రిష హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించింది. సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో దుమ్ములేపుతోంది. ప్రైమ్‌లో టాప్‌ 2లో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే తెలుగు వెర్షన్‌ మూవీ కూడా టాప్‌ 10లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇది ఏడో స్థానంలో దూసుకుపోతుంది.

ఇక ప్రైమ్‌లో మూడో స్థానంలో అనుపమా పరమేశ్వరన్‌ నటించిన `మరీచిక` మూవీ ఉంది. రెజీనా, విరాజ్‌ అశ్విన్‌ నటించిన ఈ మూవీకి సతీష్‌ కాశెట్టి దర్శకత్వం వహించారు. క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లో ఏమాత్రం ఆట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. టాప్ 3లో ట్రెండ్‌ అవుతుంది. దీంతోపాటు టాప్‌ 4లో హిందీ మూవీ గిన్నీ వెడ్స్ సన్నీ 2, ఐదో స్థానంలో హాలీవుడ్‌ మూవీ `యువర్‌ ఫాల్ట్ లండన్‌` ట్రెండ్‌ అవుతున్నాయి.

తెలుగు స్టార్స్ దమ్ము చూపిస్తున్న ఓటీటీ!

ఇక ఆరో స్థానంలో తెలుగు చిత్రం రచ్చ చేస్తోంది. అదే అడివి శేష్‌ హీరోగా నటించిన `డెకాయిట్‌`. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. ఇందులో అనురాగ్‌ కశ్యప్, ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. శానీల్‌ డియో దర్శకత్వం వహించారు. ఇది థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. గత నెల రోజులుగా ఇది టాప్‌ 10లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

ఎనిమిదో స్థానంలో ఫ్యామిలీ మూవీ `కార్మేని సెల్వం` ఉంది. సముద్రఖని, గౌతమ్‌ మీనన్‌ వంటి వారు నటించిన ఈ సినిమా ప్రైమ్‌లో టాప్‌ 8లో ఉంది. 9వ స్థానంలో `సెకండ్‌ కేస్‌ ఆఫ్‌ సీతారామ్‌` మూవీ దూసుకుపోతుంది. ఇక జ్యోతిక, సోనాక్షి సిన్హా కలిసి నటించిన హిందీ క్రైమ్‌ థ్రిల్లర్‌ `సిస్టెమ్‌` పదో స్థానంలో ట్రెండ్‌ అవుతుంది. ఇలా మొత్తంగా ఆరు సౌత్‌ మూవీస్‌ ప్రైమ్‌లో టాప్‌ 10లో ట్రెండ్ అవుతుండటం విశేషం.

ఓటీటీలో సినిమాల హవా కొనసాగుతోంది. థియేటర్ రిజల్ట్ తో సంబంధం లేకుండా, ప్రేక్షకులు కొత్త కంటెంట్‌ను ఆదరిస్తున్నారు. ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న ఈ చిత్రాల విజయాలు, ఓటీటీ భవిష్యత్తుకు నిదర్శనం. మరిన్ని సినీ అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.