|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రీతి ముకుందన్ కు కాబోయే భర్తలో ఒకే ఒక్క క్వాలిటీ చాలు!

Published: 14-07-2026, 11:41 AM
  • ప్రీతి ముకుందన్ తన కాబోయే భర్తలో ఎంపతీ (తోటివారి భావాలను అర్థం చేసుకోవడం) క్వాలిటీ కావాలని చెప్పింది.
  • బ్లాస్ట్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.
  • ఆమె ప్రకారం, ఈ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు, ఇంకే లక్షణాలు అవసరం లేదు.
  • ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రీతి ముకుందన్ తన కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడింది. బ్లాస్ట్ సినిమా ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రీతి ముకుందన్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు

Preity mukhundhan:ప్రీతి ముకుందన్.. ఈ సొగసరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కిన కన్నప్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల అర్జున్ సర్జ హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం బ్లాస్ట్ తో మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి.. అబ్బాయిల కలల యువరాణిగా మారిపోయింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను అలరించే ఈమె.. ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అలాగే తనకు కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ ను చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. మరి ప్రీతీ ముకుందన్ కోరుకుంటున్న క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

బ్లాస్ట్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొన్న ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ.. “ఒక రిలేషన్ షిప్ లో నేను అన్నిటికంటే ఎక్కువగా ఎంపతీ అనే క్వాలిటీని గౌరవిస్తాను. అంటే తోటి వారి భావాలను అర్థం చేసుకునే మనసున్న వాళ్లని నేను ఎక్కువగా ఇష్టపడతాను. అందుకే నాకు కాబోయే లైఫ్ పార్టనర్ లో కూడా నా ఎమోషన్స్, నా ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకునే వ్యక్తి నాకు తోడుగా రావాలని కోరుకుంటున్నాను. నిజానికి ఏదైనా సరే అర్థం చేసుకునే గుణం ఉంటేనే ఆ బంధం మరింత బలంగా ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే నాకు కావాల్సిన భర్తలో ఈ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు.. ఇంకే లక్షణాలు అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

భర్తలో ఎంపతీ క్వాలిటీ ఎందుకు ముఖ్యమంటే?

మొత్తానికైతే ప్రీతి ముకుందన్ కి కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఈ ఒక్క లక్షణం ఉంటే చాలా.. ఇంకేం అక్కర్లేదా? అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. ఇంత డెప్త్ గా ఆలోచిస్తున్నారు ఏంటి మేడం? అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు . ఏది ఏమైనా ఈమె ఆలోచించిన విధానం చాలా అద్భుతంగా ఉందని, అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ దొరికితే అంతకంటే స్వర్గం మరొకటి లేదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రీతి మాటలు

ప్రీతి ముకుందన్ సినిమాల విషయానికొస్తే.. ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ తమిళ సినిమా ఇదయం మురళి తెలుగులో హృదయం మురళి గా రిలీజ్ అయింది. సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ ఎందుకో ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు శర్వానంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇకపోతే తన గ్లామర్ ను, నటనను నమ్ముకొని తమిళ్ తో పాటు తెలుగు మీద ఫోకస్ చేసిన ఈమె.. వరుస సినిమాలు చేసేందుకు చక్కగా ప్లాన్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక మునుముందు మరి ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ప్రీతి ముకుందన్ చెప్పిన ఈ మాటలు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఎంపతీ ఉన్న భర్త దొరికితే అదే స్వర్గం అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆమె ఆలోచనా విధానం నిజంగా అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.