|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జబర్దస్త్ షాక్! “నేను ఎవర్నీ చంపలేదు.. ఎందుకు తిట్టారు?” – నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Published: 24-06-2026, 11:30 PM
జబర్దస్త్ షాక్! "నేను ఎవర్నీ చంపలేదు.. ఎందుకు తిట్టారు?" - నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
  • బ్లాక్ బస్టర్ “మా ఇంటి బంగారం” తర్వాత డైరెక్టర్ నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
  • “జబర్దస్త్” సినిమాపై తీవ్ర విమర్శలు, లీగల్ సమస్యలపై నందిని రెడ్డి ఆశ్చర్యం.
  • 2013లో విడుదలైన ఈ చిత్రం ఎందుకు టీవీల్లో, ఓటీటీలో లేదు? అసలు కారణం ఇదే.
  • సమంత, నిత్యా మీనన్ నటించిన ఈ చిత్రంపై యష్ రాజ్ ఫిలిమ్స్ కేసు.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు! బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమె గత చిత్రం “జబర్దస్త్” గురించి మాట్లాడారు. ఆ సినిమాపై వచ్చిన తిట్లు, లీగల్ సమస్యలపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం!

“జబర్దస్త్” సినిమాపై లీగల్ ఇష్యూస్ వెనుక కథ!

‘మా ఇంటి బంగారం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు డైరెక్టర్ బీవీ నందినీ రెడ్డి. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ క్రైమ్ కామెడీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇది సామ్ – నందిని కాంబోలో వచ్చిన నాలుగో ప్రాజెక్ట్. వీరిద్దరూ గతంలో ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ సినిమాలతో పాటుగా ‘సామ్ జామ్’ అనే ఓటీటీ షో కోసం కలిసి వర్క్ చేశారు. అయితే వాటిల్లో ‘జబర్దస్త్’ మూవీ అసలు ఎప్పుడొచ్చిందో చాలామందికి తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని ఈ సినిమా గురించి మాట్లాడారు. నందిని రెడ్డి దర్శకత్వంలో బొమ్మరిల్లు సిద్దార్థ్, సమంత రూత్ ప్రభు, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జబర్దస్త్’. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ.. 2013లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మారింది. సినిమా వచ్చి 13 ఏళ్లు దాటినా ఇంతవరకూ ఏ టీవీలోనూ ప్రసారం కాలేదు. ఓటీటీలో కూడా అందుబాటులో లేదు. దీనికి కారణం ఈ సినిమాపై లీగల్ ఇష్యూ ఉండటమే. 2010లో వచ్చిన ‘బ్యాండ్ బాజా బారాత్’ అనే హిందీ సినిమా కథని కాపీ కొట్టి ‘జబర్దస్త్’ మూవీ తీశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అప్పటికే నాని హీరోగా ‘ఆహా కళ్యాణం’ పేరుతో ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న యష్ రాజ్ ఫిలిమ్స్.. ‘జబర్దస్త్’ తమ సినిమాకి అనధికారిక రీమేక్ అని పేర్కొంటూ కోర్టులో కేసు వేశారు. ‘జబర్దస్త్’ సినిమాని ఎక్కడా ప్రదర్శించకుండా ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అయినప్పటికీ మూవీ పైరసీ ప్రింట్ ఓ యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంది. ‘జబర్దస్త్’ గురించి నందిని రెడ్డి మాట్లాడుతూ.. ”ఆ సినిమా నాకే అర్థం కాలేదు. ఇప్పుడు మూవీ కాపీ కూడా నా దగ్గర లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఆ సినిమా ఉండకూడదని కేసు వేశారు. అసలు ఆ సినిమా ఉనికిలోనే లేకుండా పోయింది. అందుకు నేను ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెబుతున్నా” అని నవ్వుతూ అన్నారు. ”జబర్దస్త్’ సినిమా చూసిన తర్వాత జనాలకు నాపై చాలా కోపం వచ్చింది. నన్ను బాగా తిట్టారు. ‘ఏందిరా బై.. నేను ఎవర్నీ చంపలేదు కదా.. ఎందుకు ఇట్లా తిడుతున్నారు. అసలేంటి ఇదంతా’ అనుకున్నాను. కొన్నాళ్లకు డైరెక్టర్ వికాస్ భల్ తీసిన ‘షాన్ దార్’ మూవీ వచ్చింది. ‘క్వీన్’ తర్వాత ఆయన తీసిన సినిమా కావడంతో, ఫస్ట్ డేనే వెళ్లి కూర్చున్నా. ఆ సినిమా చూస్తుంటే నాకు ఎంతో కోపం వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది. నా సినిమా విషయంలోనూ ఇదే జరిగిందని రియలైజ్ అయ్యా” అని నందిని తెలిపారు. నిజానికి సమంత, సిద్ధార్థ్ లతో ముందుగా ‘కళ్యాణ వైభోగమే’ సినిమా చేద్దామని అనుకున్నట్లు నందిని రెడ్డి వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతూ రావడంతో, తన దగ్గరకు ‘జబర్దస్త్’ కథని తీసుకువచ్చారని, ఆ కథ తనకు పూర్తిగా ఎక్కలేదన్నారు. కానీ వాళ్ళు ‘కళ్యాణ వైభోగమే’ మూవీ చేస్తే కెరీర్ నాశనం అవుతుందని, జబర్దస్త్ అయితే బాగుంటుందని తనని భయపెట్టేశారని, భయంతో తీసుకున్న ఏ నిర్ణయమైనా తేడా కొడుతుందని ఆమె తెలిపారు. ‘జబర్దస్త్’ సినిమాపై ముందు నుంచే తనకు కాన్ఫిడెన్స్ లేదని, కానీ చేశాం. అనుకున్నట్లుగానే తీవ్రంగా నిరాశ పరిచిందని నందిని రెడ్డి చెప్పారు. సినిమా రిలీజ్ టైంలోనే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ‘జబర్దస్త్’ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారని, టైటిల్ వాడుకుంటామని తనను సంప్రదించారని, సినిమా విడుదలయ్యాక వాడుకోమని చెప్పానని ఆమె తెలిపారు. ‘జబర్దస్త్’ సినిమా ప్లాప్ అయినా, ఆ టైటిల్ తో వచ్చిన షో మాత్రం సూపర్ హిట్ అయిందని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

“నేను ఎవర్నీ చంపలేదు కదా.. ఎందుకు తిట్టారు?” – నందిని రెడ్డి

నందిని రెడ్డికి “షాన్ దార్” సినిమాతో కలిగిన జ్ఞానోదయం!

నందిని రెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీశాయి. “జబర్దస్త్” వెనుక ఇన్ని కథలున్నాయని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరిన్ని లేటెస్ట్, వైరల్ అప్‌డేట్స్‌ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.