|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vijayawada Gade Sai Krishna : గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు – అసలేం జరిగింది..? కుటుంబం ఏం చెబుతోంది..?

Published: 18-06-2026, 3:42 PM
Vijayawada Gade Sai Krishna : గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు - అసలేం జరిగింది..? కుటుంబం ఏం చెబుతోంది..?

Vijayawada Gade Sai Krishna Missing Case : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సాయికృష్ణ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనానికి దారితీసింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు విచారణను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలోని నెహ్రూనగర్‌ ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ…. 9వ తరగతితోనే చదువు మానేశాడు. స్థానిక కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌తో పాటు నగరంలోని పలు స్టేషన్లలో గంజాయి, పోక్సో సహా వివిధ అభియోగాలపై కేసులు నమోదయ్యాయి.కొన్ని కేసులు కొట్టేయగా, మరికొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లిన సాయికృష్ణ…. ఈ ఏడాది మార్చిలోనే బయటికి వచ్చినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

అయితే గత నెల రోజులుగా సాయికృష్ణ కనిపించకుండా పోవడం…. అతని ఆచూకీ లభించకపోవడం వెనుక పోలీసుల హస్తం ఉందంటూ బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులే తమ బిడ్డను అక్రమంగా తీసుకెళ్లి ఏదో చేశారని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా తన కొడుకు ఆచూకీ ఎక్కడో చెప్పాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నానని కన్నీటిపర్యంతమవుతున్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు తనతో అత్యంత దారుణంగా… అమానవీయంగా మాట్లాడారని ఆమె ఆరోపిస్తున్నారు. నీ కొడుకును చంపేస్తాం అని హెచ్చరించిన సీఐ నాగరాజు…. చివరకు అన్నంత పని చేశాడని చెబుతున్నారు.

సాయికృష్ణ ఆచూకీని కనిపెట్టి…. అతడిని వెంటనే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ జూన్ 4వ తేదీన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సాయికృష్ణ ప్రస్తుతం ఎక్కడున్నాడో తమకు తెలియదని, అతని కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అదృశ్యమైన యువకుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు మరింత సమయం కోరడంతో…. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూన్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా సాయికృష్ణను తప్పనిసరిగా తమ ఎదుట హాజరుపరచాలని పోలీసు యంత్రాంగాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

ఈ ఘటనను ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు…. పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సాయికృష్ణ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును తక్షణమే వీఆర్‌ కు పంపించారు. సీఐ నాగరాజు స్థానంలో కృష్ణలంక కొత్త సీఐగా మురళీకృష్ణను నియమిస్తూ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.

ఈ కేసుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. పోలీసులు సాయికృష్ణను థర్డ్ డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా కొట్టి లాకప్ డెత్ చేశారని ఆరోపిస్తున్నారు. బూడిద కూడా మిగలకుండా ఆధారాలన్నీ మాయం చేశారని చెబుతున్నారు.

మరోవైపు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయవాడ కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి స్వయంగా వెళ్లారు. అక్కడ తీవ్ర శోకసంద్రంలో ఉన్న సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. తన కొడుకును పోలీసులు అన్యాయంగా తీసుకెళ్లారని జగన్ ముందు ఘోరంగా విలపించారు. “నా బిడ్డను పోలీసులు పట్టుకెళ్లి, స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలు గురిచేశారు. లాకప్‌లోనే దారుణంగా కొట్టి చంపేసి, ఆపై శవాన్ని కాల్చేశారు,” అంటూ రోధించారు.

కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ కోరారు. ఎవరూ అధైర్యపడొద్దని, బాధితులకు వైయస్ఆర్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిగి…. నిందితులకు శిక్ష పడే వరకు తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ ఉదంతం వెనుక ఉన్న అసలు సూత్రధారులను, పాత్రధారులను బయటకు లాగాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దాకా కూడా అందరూ ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నప్పుడు స్థానిక పోలీసులు జరిపే విచారణతో బాధితులకు పారదర్శకమైన న్యాయం జరగదని…. అందుకే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.