
📌 Key Points
- ప్రముఖ యూట్యూబర్లు ప్రశ్న రావణ్, కేవీఆర్‌లను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు.
- రావణ్‌కు బెయిల్ వచ్చినా, మరో కేసులో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.
- కేవీఆర్‌ను విజయనగరం జిల్లా బాడంగి పోలీసులు అరెస్ట్ చేసి బొబ్బిలి పీఎస్‌కు తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ల అరెస్టులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రశ్న రావణ్, కేవీఆర్‌లను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై అభ్యంతరకర వ్యాఖ్యల ఆరోపణలతో ఈ అరెస్టులు జరిగాయి.
యూట్యూబర్ల అరెస్టు: అసలు కారణం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు అరెస్టుల పర్వానికి దారితీసింది. రాజకీయాలపై విమర్శలు, కామెంట్లు చేసే ప్రముఖ యూట్యూబర్లు ‘ప్రశ్న’ ఛానల్ నిర్వాహకుడు రావణ్, అలాగే జర్నలిస్ట్ కె. వెంకటరామిరెడ్డి (కేవీఆర్)లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న వీరిద్దరినీ జూన్ 30 రాత్రి ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వీరిపై కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పోలీస్ స్టేషన్‌లో జూన్ 29న ‘ప్రశ్న రావణ్’పై కేసు నమోదైంది. హిందూ మతంపై, దేవతలపై, అలాగే పవన్ కళ్యాణ్‌పై రావణ్ వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యక్రతలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. సమాజంలో మత విద్వేషాలను రగల్చడం, పరువు నష్టం తదితర సెక్షన్ల కింద ఆయనపై కేసులు పెట్టారు.
మరోవైపు, జర్నలిస్ట్ కేవీఆర్‌పై గతంలోనే విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర థంబ్‌నైల్స్, అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.
ప్రశ్న రావణ్, కేవీఆర్ పై నమోదైన కేసులు
ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం విచారణ అనంతరం రాత్రి పిఠాపురంలో మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా, పూచీ కత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అయితే మరో కేసులో అతడిని వెంటనే సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2025లో నమోదైన మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు.
ఇక జర్నలిస్ట్ కేవీఆర్‌ను కూడా ఏపీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణకు చెందిన కేవీఆర్‌ను ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశారని 2 నెలల క్రితం బాడంగి మాజీ సర్పంచ్ కండి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చారు. కేవీఆర్‌ను మంగళవారం రాత్రి హైదరాబాద్ సరూర్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. బొబ్బిలి పీఎస్‌కు తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం
ఈ అరెస్టులు తెలంగాణ ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతోందని పలువురు విమర్శిస్తుండగా, జర్నలిజం ముసుగులో మత విద్వేషాలు రగిల్చే వారిని వదిలిపెట్టకూడదని మరికొందరు అంటున్నారు. ఈ అరెస్టులతో సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ కామెంట్లు చేసే మిగిలిన యూట్యూబర్లలోనూ ఆందోళన మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భావప్రకటన స్వేచ్ఛ ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఉండకూడదని అన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై చట్టం తీసుకొస్తామన్నారు. అంతేకాదు ఫిర్యాదుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ అరెస్టులు సోషల్ మీడియా స్వేచ్ఛ, రాజకీయ విమర్శల పరిమితులపై తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ ఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.


