|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జేఎన్‌టీయూ సంచలన నిర్ణయం! జర్మనీలో డ్యూయల్ డిగ్రీ.. ఐదేళ్లలో బి.టెక్-ఎంఎస్!

Published: 17-06-2026, 4:31 AM
జేఎన్‌టీయూ సంచలన నిర్ణయం! జర్మనీలో డ్యూయల్ డిగ్రీ.. ఐదేళ్లలో బి.టెక్-ఎంఎస్!
  • జేఎన్‌టీయూఏ, జర్మనీ రైట్లింగెన్ యూనివర్సిటీ మధ్య కీలక ఒప్పందం.
  • ఐదేళ్లలో బి.టెక్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ పొందే అవకాశం.
  • యూరప్‌లో ఉద్యోగ అవకాశాలు, 60% ఖర్చు ఆదా.
  • 2026-27 విద్యాసంవత్సరం నుండి కోర్సులు ప్రారంభం.

జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA) అనంతపురం విద్యార్థులకు అద్భుత అవకాశాన్ని కల్పించింది. జర్మనీలోని ప్రముఖ రైట్లింగెన్ యూనివర్సిటీతో జేఎన్‌టీయూఏ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులు ఐదేళ్లలోనే బి.టెక్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీని పొందే అవకాశం లభించింది.

జేఎన్‌టీయూఏ-జర్మనీ ఒప్పందం: డ్యూయల్ డిగ్రీ ప్రయోజనాలు

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA) అనంతపురం ఒక సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. జర్మనీకి చెందిన ప్రముఖ ‘రైట్లింగెన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీ’తో జెఎన్‌టియూఏ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుండి ఈ ఇంటిగ్రేటెడ్ B.Tech-MS కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఒకే సమయంలో JNTUA, జర్మన్ విశ్వవిద్యాలయం నుండి డ్యూయల్ డిగ్రీలను పొందే అవకాశం లభిస్తుంది.

ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కింద విద్యార్థులు తమ మొదటి నాలుగేళ్ల చదువును జేఎన్‌టీయూ అనంతపురంలో పూర్తి చేస్తారు. ఆపై చివరి (ఐదో) సంవత్సరాన్ని జర్మనీలో చదవాల్సి ఉంటుంది. సాధారణంగా B.Tech, MS పూర్తి చేయడానికి ఆరేళ్లు పడుతుంది. కానీ ఈ విధానం ద్వారా ఐదేళ్లలోనే రెండు డిగ్రీలను పూర్తి చేయవచ్చని వర్సిటీ వెల్లడించింది.

B.Tech (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) + MS (ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్)

బి.టెక్-ఎంఎస్ ప్రోగ్రామ్: కోర్సులు, అర్హతలు

B.Tech (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) + MS (డిజిటల్ బిజినెస్ మేనేజ్‌మెంట్)

ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల కు అధునాతన యూరోపియన్ టెక్నాలజీలపై పట్టు సాధించే అవకాశం లభించడమే కాకుండా, యూరప్ వ్యాప్తంగా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు తెలిపారు.

‘ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలు ఉంటాయి. ఈ చొరవ ద్వారా విద్యార్థులకు 100 శాతం ప్లేస్‌మెంట్ కల్పిస్తామనే నమ్మకం మాకుంది. అంతేకాకుండా జర్మనీలో విడిగా ఎంఎస్ చేయడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా 60 శాతం వరకు ఖర్చు ఆదా అవుతుంది.’ అని వీసీ సుదర్శన రావు వివరించారు.

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు: వీసీ సుదర్శన రావు

ఇంటర్మీడియట్ , సీబీఎస్ఈ లేదా ICSE సిలబస్‌లో MPC (గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం) స్ట్రీమ్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ అడ్మిషన్లకు అర్హులు. జెఎన్‌టీయూఎ ఫారిన్ ఎడ్యుకేషన్ అఫైర్స్ డైరెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం ఇప్పటికే స్వీడన్ యూనివర్సిటీతో కలిసి విజయవంతంగా కోర్సులను అందిస్తోందని, రాబోయే విద్యాసంవత్సరం నుండి ఈ సరికొత్త జర్మన్ ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.

ఈ కోర్సులకు సంబంధించిన మరింత సమాచారం, ఇతర వివరాల కోసం అభ్యర్థులు 7288733337 నంబర్‌లో సంప్రదించవచ్చు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

ఈ వినూత్న కార్యక్రమం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అందించడమే కాకుండా, యూరప్‌లో మెరుగైన కెరీర్ అవకాశాలను కల్పిస్తుంది. ఇది జేఎన్‌టీయూఏ విద్యారంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.