|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లిపై నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు: ‘వయసు కాదు.. అది ముఖ్యం!’

Published: 26-12-2025, 10:20 AM
పెళ్లిపై నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు: 'వయసు కాదు.. అది ముఖ్యం!'
  • నటి ప్రగతి పెళ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
  • వివాహానికి కేవలం వయసు సరిపోదని, మెచ్చురిటీ ముఖ్యమన్నారు.
  • బంధానికి గౌరవం, నమ్మకం, అవగాహన ఉండాలని ఆమె అభిప్రాయపడింది.
  • టర్కీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించింది.

ప్రముఖ నటి ప్రగతి తన పెళ్లి ఆలోచనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకోవడానికి వయసు ఒక్కటే సరిపోదని, మెచ్చురిటీ, అవగాహన, నమ్మకం, గౌరవం ఉండాలని పేర్కొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లిపై ప్రగతి ఆసక్తికర అభిప్రాయం

ప్రముఖ సినీ నటి ప్రగతి(Actress Pragathi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సహా ఇతర భాషల్లోనూ రాణించింది. తాజాగా ఆమె ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకోవడానికి కేవలం వయసుంటే సరిపోదు.. చాలా మెచ్చురిటీ ఉండాలని అన్నారు. ముఖ్యంగా ఒకరిపై ఒకరికి గౌరవం, ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన ఈ మూడూ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఒకరిపై ఒకరికి గౌరవం, నమ్మకం లేని చోట ఏ బంధం కూడా నిలబడదని తెలిపారు. ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకునే గుణం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఇటీవలే పవర్‌ లిఫ్టింగ్‌ సాధన చేసి ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారు ప్రగతి. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించారు.

Read More : ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసిన అనసూయ.. థ్యాంక్యూ శివాజీ మీరు దేవుడంటూ నెటిజన్స్ కామెంట్స్

బంధాలకు అవసరమైనవి ఏంటి?

పవర్ లిఫ్టింగ్‌లో ప్రగతి సంచలనం

ప్రగతి వ్యాఖ్యలు పెళ్లి బంధానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. కేవలం వయసు కాకుండా భావాలు, వ్యక్తిత్వం ముఖ్యమని ఆమె సందేశం స్పష్టం చేస్తుంది. పవర్ లిఫ్టింగ్‌లో ఆమె సాధించిన విజయాలు ఆమె బహుముఖ ప్రతిభకు నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.