|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాన్నవాళ్ల స్నేహితుడే నన్ను వేధించాడు.. రోడ్డుపై అలా : హీరోయిన్‌

Published: 28-10-2025, 9:35 AM
నాన్నవాళ్ల స్నేహితుడే నన్ను వేధించాడు.. రోడ్డుపై అలా : హీరోయిన్‌

ప్రముఖ నటి ఆయేషా ఖాన్ తన చిన్ననాటి చేదు అనుభవాన్ని పంచుకుంది. కేవలం 9 ఏళ్ల వయసులోనే నాన్న స్నేహితుడి ద్వారా లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించింది. ఈ సంఘటన ఇప్పటికీ వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఎదుగుదల, సినీ ప్రస్థానం గురించి ఈ కథనంలో వివరంగా చూద్దాం.

Key Points

1

నటి ఆయేషా ఖాన్ చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యారు.

2

తొమ్మిదేళ్ల వయసులో నాన్న స్నేహితుడు వేధించాడని వెల్లడి.

4

టాలీవుడ్‌లో 'ముఖచిత్రం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో నటించింది.

ఆయేషా ఖాన్ బాల్య వేధింపులు

సామాన్యులకే కాదు సెలెబ్రెటీలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు . ఇప్పుడు స్టార్ ‌ హీరోయిన్లుగా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురైనవారే ఉన్నారు . కొంతమందికి ఇండస్ట్రీ నుంచి ఎదురైతే .. మరికొంతమందికి బయట నుంచే ఇలాంటి వేధింపులు వస్తుంటాయి . వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉండడం వల్లే ఇప్పుడు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు . హీరోయిన్ ‌ అయేషా ఖాన్ ‌(Ayesha Khan) కూడా చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైయ్యారట . బాబాయ్ ‌ లాంటివాడే తనతో అసభ్యకరంగా మాట్లాడి హింసించాడట . ఇప్పటికే ఆ సంఘటన గుర్తుకు వస్తే .. కళ్ల వెంట నీళ్లు ఆగవని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆయేషా .

ముంబైకి చెందిన ఈ బ్యూటీ .. బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చి .. ఇప్పుడు వెండితెరపై రాణిస్తుంది . కసాటి జిందగీ కే అనే సీరియల్ ‌ లో ఆమె ఓ చిన్న పాత్ర పోషించింది . కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు . హిందీ బిగ్ ‌ బాస్ ‌ షో ఆమెను పాపులర్ ‌ చేసింది . సీజన్ ‌ 17 లో పాల్గొన్న ఆమె ..11 వారాల పాటు హౌస్ ‌ లో ఉండి తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది . ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి . ముఖచిత్రం సినిమాతో టాలీవుడ్ ‌ ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత గ్యాంగ్స్ ‌ ఆఫ్ ‌ గోదావరిలో విశ్వక్ ‌ సేన్ ‌ సరసన నటించి , మెప్పించింది . ఓ భీమ్ ‌ బుష్ ‌ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది . ప్రస్తుతం బెంగాలీతో పాటు పలు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది .

బిగ్ బాస్ నుండి టాలీవుడ్‌కు

సోషల్ ‌ మీడియాలో యాక్టివ్ ‌ గా ఉండే ఆయేషా .. ఎప్పటికప్పడు తన సినిమా అప్ ‌ డేట్స్ ‌ తో పాటు హాట్ ‌ ఫోటోలను షేర్ ‌ చేస్తూ తన ఫాలోవర్స్ ‌ ని అలరిస్తోంది . కొన్నాళ్ల క్రితం ఆమె ఓ చానల్ ‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నప్పుడు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది .

నాన్న స్నేహితుడితో చేదు అనుభవం

‘ ఒకప్పుడు మాది చాలా పేద కుటుంబం . తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు . చిన్న వయసులోనే లైగింక వేధింపులు ఎదుర్కొనాల్సి వచ్చింది . ఓసారి రోడ్డుపై ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే .. మా నాన్న స్నేహితుడు ఒకరు పిలిచారు . నేను ఆయనను బాబాయ్ ‌ అని పిలిచేదాన్ని . నా దగ్గరకు వచ్చి ప్రైవేట్ ‌ పార్ట్స్ ‌ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు . బాబాయ్ ‌ లాంటివాడు అలా మాట్లాడేసరికి షాకయ్యారు . ఆ వెంటనే మళ్లీ నావైపుగా వచ్చి అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు . అప్పుడు నా వయసు 9 ఏళ్లు మాత్రమే . ఆయన ఎందుకు అలా అన్నాడో , ఏం చేయాలో తెలియదు . ఇంటికి వెళ్లి ఏడ్చేశా . ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే .. కళ్లల్లోనుంచి నీళ్లు వచ్చేస్తాయి ’ అని ఆయేషా ఎమోషనల్ ‌ అయింది . ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లైంగిక వేధింపులకు గురైనప్పటికీ, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఆయేషా ఖాన్ ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవడంలో ఆమె చూపిన ధైర్యం ప్రశంసనీయం. ఈ కథనం ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.