|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

53 ఏళ్ళ వయసులో కూడా దుమ్మురేపుతోన్న హీరోయిన్, 6 సినిమాలతో సందడికి సిద్ధం

Published: 30-09-2025, 7:14 AM
53 ఏళ్ళ వయసులో కూడా దుమ్మురేపుతోన్న హీరోయిన్, 6 సినిమాలతో సందడికి సిద్ధం

అప్పటి టాప్ హీరోయిన్ టబు 53 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్‌నెస్, గ్లామర్‌తో దుమ్మురేపుతోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతూ, ‘క్రూ 2’ సహా 6 సీక్వెల్ సినిమాలతో ప్రేక్షకులను మళ్ళీ అలరించడానికి సిద్ధంగా ఉంది. ఆమె రాబోయే ప్రాజెక్టుల వివరాలు ఇక్కడ చూడండి.

Key Points

1

53 ఏళ్ల వయసులో కూడా టబు తన ఫిట్‌నెస్, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

2

'క్రూ', 'చాందినీ బార్', 'భోళా', 'దే దే ప్యార్ దే' చిత్రాల సీక్వెల్స్‌లో నటిస్తోంది.

4

మొత్తం 6 భారీ సినిమాలతో టబు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ.

టబు: అజేయమైన ఫిట్‌నెస్, గ్లామర్ రహస్యం

ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో సిల్వర్ స్క్రీన్ ను ఏలింది అప్పటి టాప్ హీరోయిన్ టబు. ఫిట్ నెస్ తో పాటు, గ్లామర్ ను కూడా జాగ్రత్తగా మెయింటేన్ చేస్తుంది. అంతే కాదు ఈ ఏజ్ లో కూడా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు సాధిస్తోంది టబు.  ఎక్కువగా సీక్వెలో సినిమాలవైపు మెగ్గుచూపుతోంది.

ఇక గతంలో టబు నటించిన  ‘క్రూ’ సినిమా సూపర్ హిట్ అయ్యక,  ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు  మేకర్స్.  ఇప్పుడు  ఆ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు టీమ్.  ఈసినిమాలో  మరోసారి టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ కలిసి కనిపిస్తారని అంటున్నారు.

ఫిల్మ్‌మేకర్ సందీప్ సింగ్, ‘చాందినీ బార్’ సీక్వెల్ ‘చాందినీ బార్ 2’ తీయబోతున్నట్టు కొద్దికాలం క్రితం ధృవీకరించారు. ఈ సినిమా షూటింగ్ 2025లో మొదలవుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాన రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాద్వారా టబు మరోసారి సందడి చేయబోతున్నారు.

వరుస సీక్వెల్స్ తో మళ్ళీ సందడికి సిద్ధం

‘భోళా’ సినిమాలో టబును ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. ఈసినిమాలో ఆమె నటన అందరిని ఫిదా చేసింది.  మీడియా కథనాల ప్రకారం, సినిమా విడుదల తర్వాత మేకర్స్ దీని సీక్వెల్ ‘భోళా 2’ తీయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో కూడా టబు ప్రధాన పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. మరి ఈసినిమాకు సబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

‘దే దే ప్యార్ దే 2’ సినిమాలో అజయ్ దేవగన్‌తో పాటు టబు కూడా కీలక పాత్రలో కనిపించనుంది. మేకర్స్ ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

టబు రాబోయే 6 సినిమాలు: పూర్తి వివరాలు

సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన  ‘దృశ్యం’ సినిమాను బాలీవుడ్ లో అజయ్ దేవగన్, శ్రీయా జంటగా రెండు సార్లు సీక్వెల్ చేశారు.  మొదటి, రెండో భాగాల్లో అజయ్ దేవగన్, శ్రీయాతో పాటు పోలీస్ పాత్రలో  అదరగొట్టారు. ఇప్పుడు దీని మూడో భాగాన్ని కూడా వీలైనంత త్వరగా తీయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా అజయ్ దేవగణ్ తో పాటు టబు సందడి చేయబోతున్నారు.

‘అంధాధున్’ విజయం తర్వాత ఇప్పుడు దీని రెండో భాగం రాబోతోంది. మేకర్స్ దీని రెండో భాగం స్క్రిప్ట్‌పై పని మొదలుపెట్టారు. ఇందులో కూడా టబు ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఈసినిమా మొదటి భాగంలో టుబు పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి ఈసారి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

53 ఏళ్ల వయసులోనూ టబు తన అద్భుతమైన నటన, గ్లామర్‌తో అవకాశాలను అందిపుచ్చుకుంటూ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తోంది. ఆమె రాబోయే 6 సీక్వెల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.