|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అడవి శేష్ కోసం టామ్ క్రూజ్ సినిమానే వదిలేసిన అనురాగ్ కశ్యప్! మామూలు డెడికేషన్ కాదుగా!!

Published: 04-04-2026, 12:35 PM
షాకింగ్: అడవి శేష్ కోసం టామ్ క్రూజ్ సినిమానే వదిలేసిన అనురాగ్ కశ్యప్! మామూలు డెడికేషన్ కాదుగా!!
  • అడవి శేష్ ‘డెకాయిట్’ మూవీ ఏప్రిల్ 10న విడుదల! భారీ అంచనాలు!!
  • అనురాగ్ కశ్యప్‌కు టామ్ క్రూజ్ సినిమాలో అవకాశం వచ్చినా నో చెప్పేశారు!
  • సినిమా కోసం అనురాగ్ కశ్యప్ డెడికేషన్ చూసి షాక్ అయిన అడవి శేష్!
  • మృణాల్ ఠాకూర్ హీరోయిన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

యంగ్ హీరో అడవి శేష్ నటించిన ‘డెకాయిట్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ నటించడం విశేషం. ఆయన గురించి అడవి శేష్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు చూద్దాం!

అనురాగ్ కశ్యప్ గురించి అడవి శేష్ కామెంట్స్ వైరల్

యంగ్ హీరో అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాను ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అడవి శేష్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అనురాగ్ కశ్యప్ చాలా గొప్ప నటుడు, ఆయన సాధారణంగా సినిమాలు ఒప్పుకోరనే టాక్ ఉంది. అలాంటి వ్యక్తిని మీరు ఎలా మీ సినిమాకు ఒప్పించారు? ఆయన సెట్‌లోకి వచ్చాక మీ ఫీలింగ్ ఎలా ఉంది?” అనే ప్రశ్న ఎదురయింది. దానికి అడవి శేష్ సమాధానం చెబుతూ… అనురాగ్ కశ్యప్ చాలా జెన్యూన్ పర్సన్. ఏది ఉన్నా నేరుగా మొహంపై చెప్పేస్తారు.

టామ్ క్రూజ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా?

అందువల్ల ఆయన మాటలు కొంతమందికి కఠినంగా అనిపించొచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. మేము సినిమా స్టోరీ చెప్పగానే మా చిత్రంలో నటించడానికి ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆయన దృష్టిలో సినిమా అంటే కేవలం సినిమా మాత్రమే. అది హిందీనా, తెలుగునా అనే భేదం ఆయన చూడరుని తెలిపారు. అలాగే షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను కూడా అడవి శేష్ వెల్లడించాడు. “మేము సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో అనురాగ్ కశ్యప్‌కు ఏకంగా టామ్ క్రూజ్ సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆయన ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేశారు. అది నా కళ్లముందే జరిగింది. ఆ ఆఫర్‌ను తిరస్కరించిన వెంటనే ‘షాట్ రెడీనా.. వెళ్దామా’ అని అడిగారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.

‘డెకాయిట్’ మూవీ విడుదల ఎప్పుడో తెలుసా?

ఆయన దాన్ని అంత లైట్‌గా తీసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను” అని శేష్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా, అది ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను దక్కించుకుంటోంది. ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపించనుండగా, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్‌ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు. మరి భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అనురాగ్ కశ్యప్ లాంటి గొప్ప నటుడు ఈ సినిమాలో నటించడం సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.