|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తనూజ విషయంలో కల్యాణ్‌ సేఫ్‌ గేమ్‌! గెలిచేసిన మాస్‌ మాధురి

Published: 22-10-2025, 3:34 AM
తనూజ విషయంలో కల్యాణ్‌ సేఫ్‌ గేమ్‌! గెలిచేసిన మాస్‌ మాధురి

బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ తర్వాత కూడా కంటెస్టెంట్ల మధ్య కోపతాపాలు తగ్గలేదు. తనూజ, కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌ల మధ్య గొడవలు కొనసాగాయి. కెప్టెన్సీ టాస్క్‌లో మాస్ మాధురి టీమ్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్‌ని ఇక్కడ చూడండి.

Key Points

1

తనూజ విషయంలో కల్యాణ్‌ సేఫ్‌ గేమ్‌ ఆడి సంజనాను నామినేట్ చేయడంతో ఇమ్మూతో గొడవ పడ్డాడు.

2

తనను బుజ్జగించబోయిన మాధురిపైనా తనూజ కోపంతో అరిచేయడం గమనార్హం.

4

కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ టాస్క్‌లో మాస్ మాధురి టీమ్ గెలిచి కంటెండర్ అయ్యింది.

నామినేషన్స్‌ లొల్లి, కల్యాణ్‌ సేఫ్‌ గేమ్‌

నామినేషన్స్‌ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్‌పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్‌పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్‌ 21వ ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

నామినేషన్స్‌ లొల్లి తనూజ ( Thanuja Puttaswamy )ను నామినేట్‌ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్‌ చేసే పవన్‌ను కల్యాణ్‌ చేతికి కట్టబెట్టాడు ఇమ్మాన్యుయేల్‌. కట్‌ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజ కు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్‌ చేశాడు. ఈ విషయంలో అతడు గొడవపడ్డాడు. రమ్య ఆల్‌రెడీ తనూజను నామినేట్‌ చేసింది. నాకు ఒక్క పాయింట్‌ కూడా మిగల్చలేదు అని కల్యాణ్‌ వివరణ ఇచ్చాడు.

తనూజ రంకెలు, రమ్య ప్లాన్

తనూజను ఎప్పుడో వదిలేశా! అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ ( Emmanuel ).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్‌గా ఉంటుందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్‌ ఇచ్చిన ఆన్సర్‌కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తనను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్‌ గేమ్‌ ఆడితే తర్వాతి వారం నామినేట్‌ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్‌.

ఇమ్మాన్యుయేల్‌పై రంకెలేసిన తనూజ మరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్‌పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్‌తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్‌లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్‌ చేయాలని బలంగా డిసైడ్‌ అయింది. ఆమె ఎలిమినేట్‌ అయ్యేవరకు నామినేట్‌ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్‌ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.

కెప్టెన్సీ టాస్క్‌: మాధురి విజయం

దొంగలుగా హౌస్‌మేట్స్‌ బిగ్‌బాస్‌ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ కోసం ఓ వెరైటీ టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్‌ మాధురి, సంజనా సైలెన్సర్‌ అంటూ టీమ్‌ లీడర్స్‌ను ప్రకటించాడు. గేమ్స్‌ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్‌లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్‌ అవుతారన్నాడు. మొదటి గేమ్‌లో మాధురి టీమ్‌ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్‌ పూల్‌లో ముంచేశారు.

మొత్తంగా, ఈ ఎపిసోడ్ నామినేషన్స్ లొల్లి, వ్యక్తిగత గొడవలు, వ్యూహాత్మక ఆటలతో ఉత్కంఠగా సాగింది. మాస్ మాధురి విజయం, రమ్య ప్లాన్స్ రాబోయే ఎపిసోడ్‌లపై ఆసక్తిని పెంచాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.