|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగ్-అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్! రికార్డుల మోత మోగించే మాస్ అప్డేట్!

Published: 14-06-2026, 4:47 PM
నాగ్-అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్! రికార్డుల మోత మోగించే మాస్ అప్డేట్!
  • నాగార్జున, అనిల్ రావిపూడి కాంబో అధికారికంగా ఫిక్స్! మాస్ అభిమానులకు పండగే.
  • నాగ్ 101వ చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతుంది. భారీ అంచనాలు.
  • చిరు, బాలయ్య, వెంకటేష్, నాగ్.. నలుగురు సీనియర్ హీరోలతో అనిల్ రికార్డు.
  • 2028 సంక్రాంతికి ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రిలీజ్ ప్లాన్.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకే చర్చ! కింగ్ నాగార్జునతో మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ఖరారైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సెన్సేషనల్ కాంబో అప్డేట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. రికార్డులు బద్దలు కొట్టే ఈ ప్రాజెక్ట్ వివరాలు మీకోసం!

నాగ్ 101వ చిత్రంగా అనిల్ రావిపూడి డైరెక్షన్

Anil Ravipudi : అనిల్ రావిపూడి.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు. సీనియర్ స్టార్ హీరోలు, యువ హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాడు. నిన్నటి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో అనిల్ రావిపూడి సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టారు. దీంతో నాగార్జునతో కూడా సినిమా చేసేస్తే అప్పటి తరం నలుగురు హీరోలతో సినిమా చేసిన ఈ తరం దర్శకుడిగా అనిల్ రావిపూడి సరికొత్త రికార్డ్ కొడతాడు.

దీంతో అనిల్ రావిపూడి – నాగార్జున సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. గతంలో వార్తలు వచ్చినా అవి రూమర్స్ అని తేలిపోయింది. తాజాగా అనిల్ రావిపూడి నాగార్జునతో సినిమాపై కామెంట్స్ చేసారు.

సీనియర్ హీరోలతో అనిల్ రావిపూడి రికార్డు

ఓ షో ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ నటి రాధ మాట్లాడుతూ.. నేను చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు చేశాను అంటే అనిల్ రావిపూడి చిరు, బాలయ్య, వెంకటేష్ లతో చేసిన సినిమా పేర్లు చెప్పి.. నాగార్జునతో మనం త్వరలో తీయబోతున్నాం అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

2028 సంక్రాంతికి భారీ ప్లానింగ్

ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నారు. నాగార్జున తన వందో సినిమా ఓ తమిళ దర్శకుడితో చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అయ్యాక నాగార్జున – అనిల్ రావిపూడి కాంబో ఉంటుందని తెలుస్తుంది. నాగార్జున 101 వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తాడని, 2028 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తారని భావిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చేస్తే అనిల్ రావిపూడి నలుగురు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన దర్శకుడిగా సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం.

కింగ్ నాగార్జున, అనిల్ రావిపూడి కాంబో టాలీవుడ్‌లో కొత్త సంచలనం సృష్టించడం ఖాయం. ఈ మెగా ప్రాజెక్ట్‌పై మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం వేచి చూడండి. మాస్ అభిమానులకు ఇది పండగే!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.