
న్యూమరాలజీ ప్రకారం, పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తిత్వం, భవిష్యత్తును తెలుసుకోవచ్చు. 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 7. వీరి గురించి తెలుసుకుందాం.
Key Points
7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ సంఖ్య 7 కలిగి ఉంటారు.
రాడిక్స్ సంఖ్య 7 వారికి కేతువు అధిపతి.
వీరు కష్టపడి పనిచేసి, అన్ని రంగాలలో విజయం సాధిస్తారు.
నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండి, ప్రజలను ఆకట్టుకుంటారు.
రాడిక్స్ సంఖ్య 7 యొక్క ప్రాముఖ్యత
న్యూమరాలజీ ప్రకారం ఫాలో అవ్వడం వలన అన్నీ కలిసి వస్తాయి. న్యూమరాలజీ మనకు వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు ఏర్పడతాయి, ఇలాంటి విషయాలను కూడా చెప్తుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు. హిందూ మతంలో, జ్యోతిష శాస్త్రంలో న్యూమరాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతి, వ్యక్తిత్వం, జీవితానికి సంబంధించిన చాలా విషయాలను న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు.
పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్ ఉంటుంది. రాడిక్స్ సంఖ్య ఆధారంగా ఆ వ్యక్తి స్వభావం తెలుసుకోవచ్చు. ఈ మూడు తేదీల్లో పుట్టిన వాళ్లు అదృష్టవంతులు, ప్రతి రంగంలో కూడా విజయాలను అందుకుంటారు.
ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ సంఖ్య ఏడు అవుతుంది. 7 అంకెకి అధిపతి కేతువు. రాడిక్స్ నెంబర్ 7 వారు ధైర్యంగా ఉంటారు, ఎంతో కష్టపడి పని చేస్తారు, ప్రతి పనిని కూడా కాన్ఫిడెన్స్‌తో పూర్తి చేస్తారు.
7 తేదీ జన్మించిన వారి ప్రత్యేకతలు
ఈ తేదీల్లో పుట్టిన వారు వారి వ్యక్తిత్వంతో సులువుగా అందరినీ ఆకట్టుకుంటారు. ఎంతో కష్టపడి పని చేస్తారు. ఇతరుల పట్ల దయతో ఉంటారు. దీంతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వారు ఎక్కడ ఉంటే అక్కడ గుర్తింపు వస్తుంది.
రాడిక్స్ నెంబర్ 7 వారు వారి కష్టం ద్వారా పేరు, ప్రతిష్టలను సంపాదిస్తారు. ఏ పని చేసినా కష్టంతో, డెడికేషన్‌తో పని చేస్తారు. ఎలాంటి రంగాల్లో అయినా సరే సక్సెస్ అందుకుంటారు. ఎడ్యుకేషన్, బిజినెస్ ఇలా ప్రతి రంగంలో కూడా వీరికి కలిసి వస్తుంది. సులువుగా విజయాలను అందుకుంటారు. వారు పడే శ్రమకి సమాజంలో పేరు, ప్రతిష్టలు పొందుతారు. గౌరవం సంపాదించుకుంటారు. అంతేకాకుండా ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా నెమ్మదిగా ఉంటారు. మరీ తక్కువ మాట్లాడినా ఆకర్షణగా ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయాలను సులువుగా గెలుచుకుంటారు.
విజయానికి కారణాలు
సొంతంగా మనుషుల్ని నిర్ణయాలను తీసుకోగలరు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. వీరి ఆలోచన విధానం కూడా బాగుంటుంది. స్వతంత్రంగా ఉంటారు. సాధారణంగా పైన చెప్పిన తేదీల్లో పుట్టిన వారు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటారు. ఎంతో అరుదుగా మాత్రమే కోపం వస్తుంది. ఆ కారణంగా సరైన నిర్ణయాలను తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు తమ కృషితో విజయం సాధిస్తారు. ప్రశాంత స్వభావం వారికి అదనపు బలాన్నిస్తుంది. కానీ, చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

