|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ahaana Krishna: కొత్త లోకా నటి బర్త్‌ డే.. తనకు తానే బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌!

Published: 15-10-2025, 10:14 AM
Ahaana Krishna: కొత్త లోకా నటి బర్త్‌ డే.. తనకు తానే బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌!

మలయాళ నటి అహానా కృష్ణ తన 30వ పుట్టినరోజును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తనకు తానే రూ.93 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చుకుంది. ఈ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Key Points

1

మలయాళ నటి అహానా కృష్ణ తన 30వ పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకుంది.

2

తనకు తానే రూ.93 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చుకుంది.

4

2014లో 'జాన్ స్టీవ్ లోపెజ్' చిత్రంతో తెరంగేట్రం చేసి, 'లోకా' వంటి చిత్రాల్లో నటించింది.

అహానా కృష్ణ బర్త్‌ డే స్పెషల్

బర్త్‌ డే వచ్చిందంటే చాలు.. సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు, ఖరీదైన బహుమతులు సర్వ సాధారణం. తాజాగా అలాగే ఓ ప్రముఖ నటి తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ అహానా కృష్ణ తన బర్త్‌డేను స్పెషల్‌గా మార్చేసుకుంది. 30 ఏట అడుగుపెడుతున్న వేళ ఖరీదైన బహుమతిని తనకు తానే ఇచ్చుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించింది.

రూ.93 లక్షల బీఎండబ్ల్యూ గిఫ్ట్

తన బర్త్‌ డే కానుకగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.93 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల వయస్సు నుంచి 30లోకి అడుగుపెట్టినందుకు కొంచెం బాధగా ఉందని రాసుకొచ్చింది. నాకు ఫుల్ సపోర్ట్‌గా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఎందుకంటే నాకు నచ్చినట్లుగా జీవించే హక్కు కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. నేను సాధించిన ప్రతిదానికీ మీరే కారణమంటూ పేరేంట్స్‌ను కొనియాడింది. నా కలలును నిజం చేసినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటానని అహానా కృష్ట ఫోటోలను షేర్ చేసింది.

అహానా సినీ కెరీర్ ప్రస్థానం

కాగా.. నటుడు కృష్ణ కుమార్ కుమార్తె అయినా అహాన కృష్ణ 2014లో సినిమాల్లో అడుగుపెట్టింది.  జాన్ స్టీవ్ లోపెజ్ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత  లూకా, అడి వంటి చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా ఈ ఏడాది నాన్సీ రాణిలో కనిపించింది. కల్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా: చాప్టర్ 1 – చంద్ర(కొత్త లోకా) చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది.

అహానా కృష్ణ తన పుట్టినరోజు వేడుకను కేవలం ఆనందంగానే కాకుండా, తన తల్లిదండ్రుల మద్దతును గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌గా మార్చుకుంది. ఈ బీఎండబ్ల్యూ బహుమతి ఆమె సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.