
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం సినీ ప్రముఖులను కలిచివేసింది. అక్షయ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, రితేష్ దేశ్ముఖ్ తో సహా అనేకమంది సినీ తారలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేశారు.
Key Points
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్, రణదీప్ హుడా, సన్నీ డియోల్ ప్రమాద బాధితులకు సంతాపం తెలిపారు.
జాన్వీ కపూర్, అనన్య పాండే, పరిణీతి చోప్రా, ఖుష్బూ సుందర్ ప్రమాదంపై తమ విచారాన్ని వ్యక్తం చేశారు.
బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారలు ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
బాలీవుడ్ తారల స్పందన
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాలీవుడ్ సినీతారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను షాక్‌కు గురి చేసిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో వారందరి కుటుంబాల కోసం మనందరం ఆ దేవుడిని ప్రార్థించాలని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం మరో నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ సైతం స్పందించారు. విమాన ప్రమాదం గురించి విని తన గుండె పగిలిందని అన్నారు. ఈ కష్ట సమయంలో ప్రయాణీకులందరికీ, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.
టాలీవుడ్ నటుల విచారం
ఈ ఘటనపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రణదీప్ హుడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాలని కోరారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని పోస్ట్ చేశారు. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న సన్నీ డియోల్ విచారం వ్యక్చం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ సమయంలో వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.
సినీ ప్రముఖుల సంతాపం
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను కదిలించిందని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేను.. విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది, ప్రతి కుటుంబం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చింది. మరో నటి అనన్య పాండే ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బాధను వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని నమ్మలేకపోతున్నానంటూ సీినియర్ నటి ఖుష్బూ సుందర్ ట్వీట్ చేసింది.
ఈ విషాదకరమైన విమాన ప్రమాదం అందరినీ కలిచివేసింది. బాధితుల కుటుంబాలకు సినీ ప్రముఖులు తమ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘోర ప్రమాదం ఎవరికీ జరగకూడదని కోరుకుందాం.


