|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

AI Movie : వామ్మో.. అకిరా హీరోగా AI తో సినిమా తీసేసారుగా.. పవన్, రేణు దేశాయ్, గౌతమ్, హాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్.. ఈ సినిమా చూశారా..?

Published: 08-12-2025, 12:08 AM
AI Movie : వామ్మో.. అకిరా హీరోగా AI తో సినిమా తీసేసారుగా.. పవన్, రేణు దేశాయ్, గౌతమ్, హాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్.. ఈ సినిమా చూశారా..?
  • AI సాంకేతికతను ఉపయోగించి అకిరా నందన్ హీరోగా ఓ గంట నిడివిగల సినిమా రూపొందింది.
  • పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, గౌతమ్ సహా పలువురు హాలీవుడ్ స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు.
  • ‘AI లవ్ స్టోరీ’ పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
  • భవిష్యత్తులో నటీనటులు లేకుండానే AIతో సినిమాలు తీసే రోజులు రావచ్చని ఈ సినిమా సూచిస్తుంది.

AI సాంకేతికత సినీ పరిశ్రమలో కొత్త సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల ఏకంగా AIని ఉపయోగించి అకిరా నందన్ హీరోగా ఓ సినిమాని తీసారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, గౌతమ్ ఘట్టమనేని, పలువురు హాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్‌లో కనిపించిన ఈ ‘AI లవ్ స్టోరీ’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

AIతో అద్భుత సృష్టి: సినిమా నిర్మాణం

AI Movie : ఏఐతో ఇప్పుడు అద్భుతాలే చేస్తున్నారు. ఊహలో ఉన్నవాటికి రూపం ఇస్తున్నారు. కొంతమంది ఏఐని మంచికి వాడుతుంటే కొంతమంది ఏఐని చెడుకి వాడుతున్నారు. సినీ పరిశ్రమలో కూడా ఏఐ భాగమవుతుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఏకంగా ఏఐ ని వాడి సినిమా తీసేసాడు. అది కూడా పవన్ తనయుడు అకిరా నందన్ ని హీరోగా పెట్టి సినిమా తీసేసాడు.(AI Movie)

అకిరా నందన్ హీరోగా హాలీవుడ్ నటి విక్టోరియా హీరోయిన్ గా రజినీకాంత్, విల్ స్మిత్, మోహన్ బాబు, రేణు దేశాయ్, లియోనార్డో డికాప్రియో, జాక్వీన్ ఫోనెక్స్, గౌతమ్ ఘట్టమనేని, ఆర్నాల్డ్ స్క్వాజ్ఞర్, బ్రిట్నీ పియర్స్, పవన్ కళ్యాణ్.. పలువురు గెస్ట్ పాత్రల్లో దాదాపు గంట నిడివిగల సినిమాని ఏఐ తో సృష్టించారు. ఏఐ లవ్ స్టోరీ అనే టైటిల్ తో యూట్యూబ్ లో నెల రోజుల క్రితమే రిలీజ్ చేసారు.

అకిరా హీరోగా, స్టార్స్ గెస్ట్ రోల్స్

ఇప్పుడు ఈ ఏఐ లవ్ స్టోరీ సినిమా వైరల్ గా మారింది. ఈ సినిమా అంతా టెక్నలాజి, లవ్ స్టోరీ, గ్రహాల మీదకు వెళ్లడం, బ్రెయిన్ డేటా.. లాంటి అంశాలను కథాంశంగా తీసుకొని లవ్ సస్పెన్స్ స్టోరీతో తెరకెక్కించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాని తెగ వైరల్ చేస్తున్నారు. చివర్లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కలిసి రావడం, మధ్యలో మహేష్ కొడుకు గౌతమ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం కూడా బాగున్నాయి.

మొత్తానికి ఏఐ ని వాడి సినిమాని తీసేసారు. పవన్ తనయుడు అకిరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే ఈ వీడియోతో హీరో అయిపోయాడు అంటున్నారు. భవిష్యత్తులో నటీనటులు లేకుండానే వారిని ఏఐలో సృష్టించి సినిమాలు తీసే రోజులు ఉన్నాయని ఈ సినిమాతో తెలిసిపోతుంది. దీనిపై సినీ పరిశ్రమ వ్యక్తులు అయితే ఇంకా ఎవరూ స్పందించలేదు. మరి ఏఐ వాడి నటీనటుల ముఖాలను వాడి ఈ సినిమా తీయడంపై ఎవరైనా సెలబ్రిటీలు స్పందిస్తారేమో చూడాలి.

వైరల్ అవుతున్న ‘AI లవ్ స్టోరీ’ విశేషాలు

మీరు కూడా ఈ ఏఐ లవ్ స్టోరీ సినిమా చూసేయండి..

మొత్తానికి AI తో సినిమా తీయడం, అకిరా నందన్ హీరోగా తెరకెక్కడం సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది. భవిష్యత్తులో AI వాడకం ఎలా ఉంటుందో ఈ సినిమా రుజువు చేసింది. మరి ఈ సాంకేతిక అద్భుతంపై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.