|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఆరాధ్య పెళ్లిలో అదిరిపోయే డాన్స్, రూమర్లకి చెక్‌.. వీడియో వైరల్‌

Published: 18-05-2025, 1:43 PM
ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఆరాధ్య పెళ్లిలో అదిరిపోయే డాన్స్, రూమర్లకి చెక్‌.. వీడియో వైరల్‌

ముంబైలో జరిగిన ఒక పెళ్ళి వేడుకలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, మరియు వారి కుమార్తె ఆరాధ్య పాల్గొని అద్భుతమైన డాన్స్ ప్రదర్శించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Key Points

1

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య ముగ్గురూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో కనిపించారు.

2

ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుండగా అభిషేక్ చప్పట్లు కొట్టారు.

4

విడిపోతున్నారనే వార్తలకు ఈ వీడియో చెక్ పెట్టింది.

పెళ్లిలో ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య డాన్స్

అభిషేక్, ఐశ్వర్య రాయ్‌ శనివారం రాత్రి ముంబైలో జరిగిన పెళ్ళికి హాజరయ్యారు. వాళ్ళతో పాటు ఆరాధ్య కూడా ఉంది. ముగ్గురూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో కనిపించారు. ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుంటే అభిషేక్ చప్పట్లు కొడుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో గాయకుడు రాహుల్ వైద్య కూడా ఉన్నాడు.

వైరల్ వీడియోలో రాహుల్ వైద్య ‘కజ్రారే’ పాట పాడుతుంటే ఐశ్వర్య డ్యాన్స్ చేస్తోంది. అభిషేక్ కూడా చప్పట్లు కొడుతూ కనిపించాడు.

వైరల్ అవుతున్న వీడియో

వీడియో చూసిన చాలా మంది ఐశ్వర్యా, అభిషేక్‌లను మెచ్చుకుంటుంటే, రాహుల్ వైద్యను ట్రోల్ చేస్తున్నారు. పెళ్ళిళ్లలో పాటలు పాడటం నచ్చలేదని కామెంట్లు పెడుతున్నారు.

అభిషేక్, ఐశ్వర్య రాయ్‌ విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వీడియోతో ఆ వార్తలకు చెక్ పడింది. అభిషేక్, ఐశ్వర్య 18 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు. 2007లో వాళ్ళ పెళ్లి జరిగింది. వీరికి కూతురు ఆరాధ్య జన్మించిన విషయం తెలిసిందే.

విడాకుల వార్తలకు చెక్

ఆరాధ్య ఇప్పుడు చాలా పెద్దదైంది. చూడబోతుంటే త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఐష్‌, అభిషేక్‌ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి ఈ వీడియో ఫుల్ స్టాప్‌ పెట్టినట్టేనా అనేది ఆసక్తికరంగా మారింది.

ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ దంపతుల వైరల్ డాన్స్ వీడియో వారి విడాకుల వార్తలకు పుల్ స్టాప్ పెట్టింది. వారి కుటుంబ సంతోషం స్పష్టంగా కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.