|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చీరలో ఐశ్వర్య రాజేష్ విధ్వంసం! చూపు తిప్పుకోలేరంత అందం.. వైరల్ ఫోటోలు!

Published: 31-01-2026, 1:35 AM
చీరలో ఐశ్వర్య రాజేష్ విధ్వంసం! చూపు తిప్పుకోలేరంత అందం.. వైరల్ ఫోటోలు!
  • ఐశ్వర్య రాజేష్ చీరలో మెరుపులు, ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయే ఫోజులు!
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో ఐశ్వర్య అదరగొట్టింది.
  • సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ సందడి, ఫాలోవర్స్‌కు ట్రెండీ అప్‌డేట్స్!
  • నెటిజన్ల కామెంట్స్: చీరలో ఐశ్వర్యను చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావంటూ ప్రశంసలు.

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మరోసారి తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. చీరలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

ట్రెడిషనల్ లుక్‌లో ఐశ్వర్య రాజేష్ మెరుపులు

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamurthy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Annil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranti Ki Vastunnam) మూవీలో నటించి మెప్పించింది. మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు తలుపులు తడుతున్నాయి. ప్రజెంట్ చేతి నిండా సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో కూడా బాగా యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌కు కూడా దగ్గరవుతూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక విషయం గురించి తెలుపుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈక్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్

తాజాగా ఐశ్వర్య రాజేష్ తన ఇన్‌స్టాలో కొన్ని ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేసింది. అందులో శారీ కట్టుకొని మినిమల్ జ్యూవెలరీతో చాలా అందంగా ముస్తాబయ్యింది. తన ఒంపు సొంపులతో కొన్ని పిక్స్‌కు డిఫరెంట్ ఫొజులు ఇచ్చింది. ఇక వాటికి.. ‘మీ జీవితాంతం, ఆ ఎంపికతో మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు’అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు శారీలో నిన్ను చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఐశ్వర్య సందడి

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)

ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.