|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఏడాదిగా టాలీవుడ్‌లో ఐశ్వర్య రాజేష్‌కు నో ఛాన్స్! కారణం ఇదేనా?

Published: 30-01-2026, 5:05 AM
షాకింగ్: ఏడాదిగా టాలీవుడ్‌లో ఐశ్వర్య రాజేష్‌కు నో ఛాన్స్! కారణం ఇదేనా?
  • ఐశ్వర్య రాజేష్‌కు తెలుగులో అవకాశాలు కరువయ్యాయన్న షాకింగ్ నిజం!
  • సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్!
  • తెలుగులో అవకాశాలు రాకపోవడంపై ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
  • తమిళంలో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న ఐశ్వర్య రాజేష్

టాలీవుడ్ లో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్ అయినా కూడా ఆమెకు అవకాశాలు రావడం లేదు. దీనిపై ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దాం!

సంక్రాంతి హిట్ తర్వాత ఆఫర్స్ ఏవీ?

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అవడానికి తెలుగు అమ్మాయే అయినా తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. చిన్న వయసులోనే పెద్ద పెద్ద పత్రాలు చేసి మెప్పించింది. అయినా కూడా కెరీర్ లో అసలైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. తాజాగా ఈ బ్యూటీ తెలుగులో నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో భాగ్యం పాత్రలో నటించి ఒక రేంజ్ లో మెప్పించింది.

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా తరువాత ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కి తెలుగు నుంచి భారీ ఆఫర్స్ క్యూ కడతాయి అని చాలా మంది అనుకున్నారు. అలాగే ఆడియన్స్ కూడా ఫీలయ్యారు. కానీ, దానికి పూర్తిగా ఉంది సిచువేషన్. ఏడాదిగా ఐశ్వర్య రాజేష్ ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. అసలు అవకాశాలు రాలేదు.

మేకర్స్ నమ్మడం లేదా?

అయితే, ఇదే విషయంపై తాజాగా ఐశ్వర్య రాజేష్ స్పందించింది. ఒకింత ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సాధించింది. ఆ తరువాత నాకు వరుస ఆఫర్స్ వస్తాయని అనుకున్నాను. కానీ, ఆలా జరగలేదు. స్టార్స్ సినిమాల్లో కూడా ఆఫర్స్ వస్తాయని అనుకున్నాను. కానీ, మేకర్స్ కి నమ్మకం రావడం లేదు. తాను చేయగలదా అనే అనుమానంలోనే ఉండిపోయారు.

ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ కామెంట్స్!

కానీ, నాకు వస్తున్న అవకాశాలు చేసుకుంటూ వెళ్తున్నాను. వాటిలో నాకు నచ్చిన కథలను చేస్తున్నాను. ఇదే నాకు సంతోషంగా ఉంది. నాకు 24 ఏళ్ళ వయసులోనే ఇద్దరు పిల్లల తల్లిగా నటించి మెప్పించాను. భవిష్యత్తులో మంచి సినిమాలు చేయడానికి కష్టపడతాను” అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.

ఐశ్వర్య రాజేష్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె త్వరలోనే టాలీవుడ్ లో సత్తా చాటుతుందని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.